📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Latest Telugu News: Crime-కేరళ అటవీ శాఖ మంత్రి మేనకోడలి కుటుంబం దారుణ హత్య

Author Icon By Vanipushpa
Updated: August 29, 2025 • 5:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేరళ(Kerala)లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి(State forest Minister) ఏకే శశీంద్రన్(AK Shashindran) కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మేనకోడలి కుటుంబం దారుణ హత్యకు గురైంది.ఆయన మేనకోడలు శ్రీలేఖ(Srelekha) (67), ఆమె భర్త భర్త ప్రేమరాజన్ పికె(Premarajan PK) (76)లు కన్నూర్‌లోని చిరక్కల్ పంచాయతీలోని అలవిల్ నార్త్‌లో బెడ్ మీద దంపతులు విగత జీవులుగా పడి ఉన్నారు. వారి పిల్లలు విదేశాల్లో ఉండగా కన్నూర్‌లో శ్రీలేఖ దంపతులు ఒంటరిగా నివసిస్తున్నారు. విదేశాల నుంచి వస్తున్న ప్రేమరాజన్ కొడుకును తీసుకొచ్చేందుకు..కారు కోసం శ్రీలేఖ ఇంటికెళ్లిన డ్రైవర్ ఇంటి తలుపులు మూసి ఉండడాన్ని గమనించాడు. ఎన్నిసార్లు పిలిచినా సమాధాన రాకపోవడంతో — స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టగా మృతదేహాలు బయటపడ్డాయి. సుత్తితో తలపై కొట్టి చంపి మృతదేహాలు కాల్చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.

Crime-కేరళ అటవీ శాఖ మంత్రి మేనకోడలి కుటుంబం దారుణ హత్య

రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు
ఈ ఘటనను ముందుగా డ్రైవర్ చూసి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అటవీ శాఖ మంత్రి ఎకె శశీంద్రన్ మేనకోడలు శ్రీలేఖ, తన భర్త ప్రేమ రాజన్ తో కలిసి కన్నూర్ లో నివసిస్తున్నారు. కాగా, ఆ దంపతుల సంతానం బహ్రేయిల్ లో ఉంటున్నారు. అయితే.. బహ్రెయిన్ నుండి వస్తున్న పిల్లల్ని తీసుకొని రావడం కోసం డ్రైవర్ కారు కోసం ఇంటికి వెళ్లాడు. బైటనిలబడి ఎన్నిసార్లు ఫోన్ చేసిన కూడా వీరి నుంచి సరైన రెస్సాన్స్ రాకపోవడంతో కిటీకి నుంచి చూడగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు రంగంలోకి దిగి ఇంట్లోకి వెళ్లి చూడగా.. బెడ్ మీద కాలిపోయిన గాయాలతో ఇద్దరు రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు. శరీర భాగాలు పూర్తిగా కాలిపోయి ఉన్నాయి.

పోలీసులు కేసు నమోదు

మరోవైపు పోలీసులు వారిని గుర్తుతెలియని వ్యక్తులు సుత్తితో కొట్టి, కాల్చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఘటన గురించి సమాచారం అందంగానే మంత్రి హుటాహుటిన కన్నూర్ లోని ఘటన స్థలానికి బయలు దేరారు. మంత్రి ఇంట్లో దారుణ ఘటన జరగడంతో అధికారులు వెంటనే స్పందించారు. ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, బుధవారం రోజున చివరిసారి వారిని చూసినట్లు చుట్టుపక్కల వారు చెబుతున్నారు. పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీకెమెరాల్ని జల్లెడపడుతున్నారు. ఈఘటన కేరళలో సంచలనంగా మారింది. కన్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/japan-a-request-from-subhash-chandra-boses-daughter-to-modi-in-japan/international/537869/

Crime News Family Murder Forest Minister Kerala News Kerala Politics Murder case Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.