📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

Latest News: Kerala Crime – మైనర్ బాలుడిపై సామూహిక లైంగిక దాడి

Author Icon By Anusha
Updated: September 16, 2025 • 12:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లైంగిక దాడులు అంటే చాలా మంది ముందుగా మహిళలపై జరిగే నేరాలనే ఊహిస్తారు. పసిపిల్లల నుంచి పెద్దవయసు మహిళల వరకు దుర్మార్గుల బారిన పడుతున్నారని వార్తల్లో తరచూ చూస్తుంటాం. అయితే సమాజంలో కొన్నిసార్లు పురుషులు కూడా లైంగిక దాడులకు (Sexual assault) గురవుతున్నారన్న నిజం చాలా మందికి తెలియదు లేదా గుర్తించబడదు. ఈ రకమైన ఘటనలు తక్కువ సంఖ్యలో వెలుగులోకి వస్తున్నప్పటికీ,తాజాగా కేరళలో ఇలాంటి ఘోరమే జరిగింది.

ఓ 16 ఏళ్ల బాలుడిపై 14 మంది పురుషులు.. రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులందరూ ఎల్‌జీబీటీక్యూ (LGBTQ) వర్గానికి చెందిన వారి కోసం ప్రత్యేకంగా ఉన్న ఒక మొబైల్ యాప్ ద్వారా బాలుడితో స్నేహం పెంచుకున్నారు. మొదట మంచి మాటలతో నమ్మకం కల్పించి.. ఆ తర్వాత బాలుడి బలహీనతలను ఆసరాగా తీసుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ అఘాయిత్యం బాలుడి ఇంటితో పాటు కన్నూర్, కోజికోడ్ జిల్లాలతో (Kozhikode district) సహా అనేక ప్రదేశాలలో రెండు సంవత్సరాల పాటు కొనసాగింది. 

చంపేస్తామంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారు

మొత్తంగా 14 మంది తమకు ఇష్టం వచ్చినప్పడుల్లా బాలుడిపై అత్యాచారం (Rape) చేశారు. విషయం ఎవరికైనా చెబితే.. చంపేస్తామంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. దీంతో సదరు బాలుడు రెండేళ్లుగా నరకం అనుభవిస్తూ.. వారి చెప్పినట్లే నడుచుకున్నాడు.కానీ అదృష్టవశాత్తు ఓ రోజు బాలుడి తల్లి ఈ విషయం గుర్తించింది. ముఖ్యంగా ఓ నిందితుడు నేరుగా బాలుడి ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డాడు.

Kerala Crime

అదే సమయంలో బాలుడి తల్లి ఇంట్లోకి రాగా.. ఈ ఘటన ఆమె కంట పడింది. దీంతో నిందితుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో అనుమానం వచ్చిన తల్లి బాలుడి (boy) ని ప్రశ్నించగా.. జరిగిన విషయం మొత్తం చెప్పాడు. తనకు జరుగుతున్న అన్యాయం గురించి వివరిస్తూనే విపరీతంగా ఏడ్చాడు. దీంతో బాలుడిని ఓదార్చిన తల్లి ఆపై.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ముఖ్యంగా బాలుడు చెప్పిన ఆధారాలతో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు.

9 మంది అరెస్ట్

అరెస్టు అయిన వారిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండడం ఈ కేసులో మరో సంచలన అంశంగా నిలిచింది. అయితే మిగతా ఐదుగురు నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వివరించారు. ఈ దారుణానికి పాల్పడిన వారందరినీ చట్ట ప్రకారం శిక్షించి.. బాధితుడికి న్యాయం చేకూర్చేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

మరోవైపు నెట్టింట ఈ వార్త వైరల్ అవుతుండగా.. పిల్లల తల్లిదండ్రులకు అనేక సూచనలు చేస్తున్నారు. పిల్లలు ఎలా ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, సెల్‌ఫోన్‌లో ఏమేం చూస్తున్నారు వంటివన్నీ ఓ కంట కనిపెడుతూ ఉండాలని వివరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/uttar-pradesh-baby-girl-buried-alive-by-parents/national/548053/

Breaking News lack of awareness latest news male sexual abuse men also victims recent kerala incident Telugu News underreported cases

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.