Karnataka crime: కర్ణాటకలోని గదగ్ జిల్లా లక్ష్మేశ్వర్‌లో అత్యంత క్రూరమైన హత్య వెలుగుచూసింది. కేవలం మూడు నెలల క్రితం నిశ్చితార్థం జరిగిందన్న కోపంతో, ఒక యువకుడిని ప్రత్యర్థి గొంతు కోసి, గొడ్డలితో నరికి కిరాతకంగా చంపాడు.
Read Also:Sunil Nayak Bail: ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ
ప్రేమ ఉన్మాదం.. ప్రాణం తీసింది
పోలీసుల కథనం ప్రకారం.. ఫరూక్ సనది (25) అనే యువకుడికి మూడు నెలల క్రితం ఒక యువతితో నిశ్చితార్థం జరిగింది. అయితే, అదే యువతిని ధార్వాడ్ జిల్లాకు చెందిన దావల్ సాబ్ మకందర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. తాను ప్రేమించిన యువతిని ఫరూక్ పెళ్లి చేసుకోబోతున్నాడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన దావల్ సాబ్, అతడిని వదిలించుకోవాలని పథకం వేశాడు.
ఈ క్రమంలో ఫరూక్‌ను నమ్మించి పొలాల్లోకి తీసుకెళ్లి, అక్కడ గొంతు కోసి, గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘోరం స్థానికంగా పెను కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు దావల్ సాబ్ మకందర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: