Karnataka Crime News:కన్నకూతురిని కత్తితో పొడిచి చంపిన తండ్రి

Read Time:  1 min
Karnataka Crime News
Karnataka Crime News
FONT SIZE
GET APP

Karnataka Crime News: కర్ణాటకలోని కుంజత్తూరులో ఆస్తి వ్యామోహం కన్నప్రేమను కబళించింది. కేవలం ఆస్తి, బంగారం వివాదం కారణంగా ఓ తండ్రి తన 18 ఏళ్ల కుమార్తెను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Read Also: Uttara Kannada murder : ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం

ఆస్తి గొడవతో మొదలై.. హత్యతో ముగిసి..

కుంజత్తూరుకు చెందిన ఉమర్ అనే వ్యక్తికి తన కుటుంబ సభ్యులతో కొంతకాలంగా ఆస్తి మరియు బంగారం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం కూడా ఇదే విషయంపై ఇంట్లో తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఉమర్, తన స్వంత కుమార్తె జుమైలా (18) పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

Karnataka Crime News
Karnataka Crime News: A father stabbed and killed his own daughter.

అడ్డువచ్చిన బాబాయ్‌పై కూడా దాడి

ఈ ఘోరాన్ని అడ్డుకోవడానికి జుమైలా బాబాయ్ షేకుంజి ప్రయత్నించగా, ఉమర్ ఆయనపై కూడా కత్తితో దాడి చేశాడు. దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గొడవ విన్న స్థానికులు లోపలికి వెళ్లి చూడగా, జుమైలా రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. తీవ్రంగా గాయపడిన షేకుంజిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కన్నతండ్రే కాలయముడిగా మారి కుమార్తెను బలితీసుకోవడం చూసి స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు ఉమర్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.