Karnataka Crime: కర్ణాటకలోని బెంగళూరు జిల్లా, దేవనహళ్లి తాలూకా కుందన గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 37 ఏళ్ల రేణుక అనే మహిళ ప్రత్యర్థుల దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు మూలం నిందితుడు రంజిత్ ప్రవర్తనేనని పోలీసులు గుర్తించారు. గతంలో రంజిత్, రేణుక మైనర్ కుమార్తెను వివాహం చేసుకుంటానని ప్రతిపాదించగా, కుటుంబ సభ్యులు దానికి నిరాకరించారు. అంతేకాకుండా, బాలికను వేధిస్తున్నాడనే ఆరోపణలతో అతనిపై పోక్సో (POCSO) కేసు నమోదు చేయించారు.
Read Also: Tirupati Bhuvana Suicide Case: భువన మృతి.. హత్య లేక ఆత్మహత్య?
జైలు నుంచి వచ్చి కక్ష సాధింపు
పోక్సో కేసులో అరెస్ట్ అయిన రంజిత్ కొంతకాలం జైలులో ఉండి, ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. తనను జైలుకు పంపారన్న కోపంతో రేణుక కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేశాడు. గతరాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి రేణుక ఇంటిపై భౌతిక దాడికి దిగాడు. ఈ ఘర్షణలో నిందితులు రేణుకపై తీవ్రంగా దాడి చేయడంతో ఆమెకు రక్తగాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన ఆమె చికిత్స పొందుతూ మరణించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: