తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో నిషేధిత చైనా మాంజా(Chinese manjha) వినియోగం వల్ల ప్రాణాపాయ ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రం(Karnataka) బీదర్ జిల్లాలో మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బైక్‌పై ప్రయాణిస్తున్న సంజు కుమార్ హోసమణి (48) అనే వ్యక్తి గొంతుకు చైనా మాంజా తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.
Read Also: TG Crime: డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు
అంబులెన్స్ రాకముందే మృతి
రక్తస్రావం అధికంగా జరిగి, అంబులెన్స్ వచ్చేలోపే ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనా మాంజా విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: