కర్ణాటక (Karnataka) లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ట్రావెల్ బస్సును లారీ ఢీకొనడంతో నిన్న (గురువారం) ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్ హైవే 48పై ఓ లారీ హిరియూర్ నుంచి బెంగళూరు వెళ్తోంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళుతోంది.
Read Also: SIR: ఉత్తర్ ప్రదేశ్ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?
చిత్రదుర్గ జిల్లా, హిరియూర్ తాలూకాలోని గొర్లతు క్రాస్ వద్ద అతి వేగంగా వెళుతున్న లారీ అదుపుతప్పింది. డివైడర్‌ను దాటి, మరొక వైపు నుండి వస్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో స్లీపర్ కోచ్ బస్సు రోడ్డు మధ్యలో మంటల్లో చిక్కుకుంది. బస్సుతో పాటు లారీ కూడా పూర్తిగా దగ్ధమైంది. ఈ బస్సు ప్రమాదంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు మృతి చెందారు.
చావులోనూ వీడని స్నేహం
నవ్య, మానస ఇద్దరూ మరణంలోనూ కలిసే ఉన్నారంటూ నవ్య తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు. చిన్నప్పటి నుంచి వారిద్దరూ కలిసే పెరిగారని, ఒకేచోట చదువుకున్నారని తెలిపారు. ఈ మేరకు ఒకేచోట పనిచేస్తున్న ఈ స్నేహితులు సెలవులకు ఇంటికి వస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: