Karimnagar SI Wife Suicide: గన్నేరు పప్పు సేవించి ఎస్సై భార్య ఆత్మహత్య!

Read Time:  1 min
Karimnagar SI Wife Suicide: గన్నేరు పప్పు సేవించి ఎస్సై భార్య ఆత్మహత్య!
FONT SIZE
GET APP

Karimnagar SI Wife Suicide: కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Read Also:Indore Fire Accident: ఇండోర్‌లో ఘోర అగ్నిప్రమాదం: ఏడుగురు సజీవదహనం!

Karimnagar SI Wife Suicide: SI's wife commits suicide after consuming gunpowder!
Karimnagar SI Wife Suicide: SI’s wife commits suicide after consuming gunpowder!

ఘటన వివరాలు

మంగళవారం రోజున దివ్య గన్నేరు పప్పు దంచుకుని సేవించి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో పోరాడిన దివ్య, బుధవారం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కారణాలపై దర్యాప్తు

గత కొంతకాలంగా దివ్య తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారని, ఆ నొప్పిని భరించలేకే ఆమె ఈ విపరీత నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే, ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై కుటుంబంలో జరిగిన ఈ విషాదంతో తోటి పోలీస్ అధికారులు, సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.