SI Chandrashekhar Suicide Karimnagar: కరీంనగర్ జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. భార్య మరణాన్ని తట్టుకోలేక, ఆమె మరణించిన ఐదో రోజే ఎస్సై (SI) చంద్రశేఖర్ బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. విధి నిర్వహణలో చురుగ్గా ఉండే ఒక పోలీస్ అధికారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరినీ కలిచివేస్తోంది.
Read Also: Kamareddy Software Engineer Suicide: పెళ్ళైన నెల రోజులకే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వినయ్ కుమార్ ఆత్మహత్య
ఘటన వివరాలు
ఐదు రోజుల క్రితం చంద్రశేఖర్ భార్య దివ్య గన్నేరు పప్పు తిని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమె కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దివ్య మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఇల్లందకుంట మండలం సీతంపేటకు తరలించగా, అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దివ్య మరణానికి భర్త చంద్రశేఖరే కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆయనపై దాడికి ప్రయత్నించారు.
దీంతో గ్రామస్తులు, బంధువుల నిరసనల మధ్య మృతురాలి తల్లిదండ్రులు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా, అనంతరం డ్రెస్ మార్చుకుంటానని గదిలోకి వెళ్లిన చంద్రశేఖర్, ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో బంధువులకు అనుమానం కలిగింది. గది తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆయన ఉరివేసుకొని వేలాడుతూ కనిపించారు.
వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు.ఎల్లప్పుడూ విధి నిర్వహణలో చురుగ్గా ఉండే ఎస్సై చంద్రశేఖర్, భార్యపై ఉన్న మమకారంతో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడటం తోటి సిబ్బందిని, బంధువులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: