Kanpur News: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమో, యంత్రాల లోపమో తెలియదు కానీ, కన్నవారికి కడుపుకోత మిగిలింది. బకర్‌గంజ్‌కు చెందిన అరుణ్ నిషాద్, బిట్టు దంపతులకు ఆదివారం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆడబిడ్డ జన్మించింది. శిశువు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచేందుకు వైద్యులు పాపను వార్మర్ (Warmer) మెషీన్‌లో ఉంచారు.
Read also: Anakapalli accident: రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
అయితే, డాక్టర్ వివేక్ మిశ్రా పర్యవేక్షణలో ఉన్న ఆ వార్మర్ మెషీన్‌లో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా వ్యాపించడంతో, అందులో ఉన్న పసికందు సజీవదహనమైంది. ఈ దారుణ ఘటనతో చిన్నారి తండ్రి తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: