📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Kamareddy crime: చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు!

Author Icon By Pooja
Updated: March 8, 2026 • 12:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Kamareddy crime: కామారెడ్డి జిల్లాలో ముగ్గురు చిన్నారుల మృతి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు పట్టణంలోని పెద్ద చెరువులో శవాలై తేలడం విషాదానికి గురిచేసింది. మరణించిన వారంతా ఎనిమిది సంవత్సరాల లోపు వారే కావడంతో జిల్లావ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆర్బీ నగర్ కాలనీకి చెందిన ఒక ఆటో డ్రైవర్ పిల్లలైన సీపాత్ (8), ఆయాత్ (7), మరియం (5) శనివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. ఉదయం తండ్రి వారిని ఆటోలో తీసుకెళ్లి దుకాణం వద్ద వదిలేసినట్లు సమాచారం.

Read Also:AP crime: రాజమండ్రి కోర్టులో అనంతబాబు భార్యకు చుక్కెదురు

Kamareddy crime: Bodies of three children found in a pond!

తండ్రిపైనే పోలీసుల అనుమానం

సాయంత్రమైనా పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చేపట్టిన పోలీసులకు చివరకు పట్టణంలోని పెద్ద చెరువులో చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే, ఈ ఘటనపై పిల్లల తండ్రి చెబుతున్న మాటలు పొంతన లేకుండా ఉండటంతో పోలీసులు అతడిని అనుమానిస్తున్నారు. ఉదయం పిల్లలను షాపు వద్ద దించి కిరాయికి వెళ్లానని, వారు ఆడుకుంటూ వెళ్లి చెరువులో పడి ఉంటారని అతడు చెబుతున్నాడు. ఈ సమాధానాలపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కామారెడ్డిలో గత రెండు రోజులుగా చిన్నారులు వరుసగా అదృశ్యం కావడం కలవరపెడుతోంది. శుక్రవారం గోసంగి కాలనీకి చెందిన సింహాద్రి (10), విజయ్ (9) అనే ఇద్దరు బాలురు కూడా అదృశ్యమయ్యారు. వీరి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఈ అదృశ్యాలు, మరణాల నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేసి, ఈ మరణాల వెనుక అసలు మిస్టరీని ఛేదించే పనిలో ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ChildrenDeath Kamareddy Crime MissingChildren PoliceInvestigation TragicIncident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.