Kakinada Blast Updates: వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

Read Time:  1 min
Kakinada Blast Updates: వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు
FONT SIZE
GET APP

Kakinada Blast Updates: సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటనలో మరణాల సంఖ్య 21కి పెరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించే ప్రక్రియను పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటివరకు 13 మంది మృతదేహాలను అధికారులు గుర్తించగా, మిగిలిన వారి వివరాల కోసం గాలింపు కొనసాగుతోంది.

Read Also: Kakinada Blast Incident: కాకినాడలో పేలుడు.. 18 మంది మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.

Kakinada Blast Updates: Vetlapalem blast.. 21 dead, 13 identified
Kakinada Blast Updates: Vetlapalem blast.. 21 dead, 13 identified

గుర్తించిన మృతుల వివరాలు

ప్రమాదంలో మరణించిన వారిలో పరిశ్రమ యజమాని అడబాల శ్రీనుతో పాటు కడిపల్లి కృపమ్మ, ధనరాజు, సాధనాల సత్యవతి, వల్లూరి రవి, రాము, గంపల మంగ, గొడత మహేశ్, మందపల్లి చిన్ని, నాని, నిమ్మడ కరుణ, గొట్ట మహేశ్ మరియు రమణ ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చిధ్రం కావడంతో గుర్తింపు ప్రక్రియ సవాలుగా మారింది.

రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి

ఈ పెను విషాదంపై రాష్ట్రవ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతోంది. మంత్రి నారా లోకేశ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తదితర నేతలు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉండాలని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన సహాయం అందించాలని వారు కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.