ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ(Justice Varma) దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్(Justice BRGavai) వైదొలిగారు. ఈ మేరకు బుధవారం వెల్లడించారు. విచారణ కమిటీలో తాను ఉన్నందున దాన్ని వేరొక బెంచ్‌కు బదిలీ చేస్తామని పేర్కొన్నారు. దిల్లీ హైకోర్టు(Delhi High Court) న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం పెండింగ్‌లో ఉండగా, ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ విచారించేందుకు నిరాకరించారు. ఈ ఘటన న్యాయవ్యవస్థలో సంచలనం సృష్టించింది.
వివాదం ప్రాస్తావికం
జస్టిస్ వర్మ ఇంటి ఆవరణలో కాలిపోయిన నోట్ల కట్టలు దొరికిన ఘటనపై ఆయనపై అనుమానాలు తలెత్తాయి. ఈ విషయంపై ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేయగా, నోట్ల కట్టలు దొరికినట్టు తేలింది. కమిటీ నివేదికలో నిజం బయటపడిన తర్వాత
వర్మ తిరస్కరణ: అభిశంసన తీర్మానం, రాష్ట్రపతికి జస్టిస్ సంజీవ్ ఖన్నా లేఖ
ప్రధాని మోదీకి లేఖ
లోక్‌సభలో 145 మంది ఎంపీల పిటిషన్, రాజ్యసభలో 63 మంది ప్రతిపక్ష సభ్యుల నోటీసులు
సుప్రీంకోర్టు విచారణ – జస్టిస్ గవాయ్ వైదొలిక
జస్టిస్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టులో విచారించాల్సి ఉండగా, విచారణ కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నందున కేసు నుంచి వైదొలుగుతున్నట్లు జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రకటించారు.
వేరొక బెంచ్‌కు కేసు బదిలీ
జస్టిస్ గవాయ్ విచారణకు అర్హతలేనని స్వయంగా ప్రకటన, అత్యవసర పిటిషన్ల దాఖలుపై ఆయన అసహనం న్యాయవాదుల వ్యాఖ్యలు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ హాజరు
రాజ్యాంగ సమస్యలపై చర్చ అవసరం అని విజ్ఞప్తి, తక్షణ విచారణ కోరిన వర్మ తరఫు వాదనలు
దీంతో అభిశంసనకు సిఫారసు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీలకు జస్టిస్ సంజీవ్ ఖన్నా లేఖలు రాశారు. జస్టిస్ వర్మను విధుల నుంచి తొలగించాలని కోరుతూ పార్లమెంటు ఉభయసభల్లో ఎంపీలు అభిశంసన తీర్మానాన్ని కూడా ఇచ్చారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఈమేరకు 145 మంది ఎంపీలు తమ పిటిషన్‌ను ఇటీవల సమర్పించారు. రాజ్యసభలో కూడా 63 మంది ప్రతిపక్ష ఎంపీలు నోటీసులు సమర్పించారు .
జస్టిస్ యశ్వంత్ వర్మ నేపథ్యం ఏమిటి?
రేవా విశ్వవిద్యాలయం, ఎంపీ నుండి ఎల్ఎల్‌బి డిగ్రీని పొందారు మరియు ఆ తర్వాత 8 ఆగస్టు 1992న న్యాయవాదిగా చేరారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: India – Pak : భారత్ కంటే సేఫెస్ట్ కంట్రీగా పాకిస్థాన్..?