భారత రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జేపీ గ్రూప్ కు చెందిన జేపీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) చర్యలు చేపట్టింది. ఈ చర్యలో భాగంగా, కంపెనీ(Manoj Gaur) మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గౌర్ ను మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేసింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రకారం..మనోజ్ గౌర్ నేతృత్యంలో జేపీ ఇన్ ఫ్రాటెక్, దాని పెరెంట్ కంపెనీ జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ (జెఎల్) దాదాపు రూ.12వేల కోట్ల విలువైన భారీ ఆర్థిక మోసం, గృహ కొనుగోలుదారుల నిధుల దుర్వినియోగంలో పాల్గొన్నట్లు తేలింది.
Read also: మీ డబ్బుపై AI నిఘా.. తేడా వస్తే నోటీసులే
15 ప్రదేశాల్లో సమకాలీన దాడులు
మే 2025లో, ఈడి మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ ఎ)కింద ఒక విస్తృత దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో ఢిల్లీ, నోయిడా, ముంబై, లక్నో తదితర నగరాల్లోని 15 ప్రదేశాలపై సమకాలీన దాడులు జరిగాయి. అధికారుల ప్రకారం, ఈ దాడుల్లో రూ.1.70 కోట్ల నగదు, అనేక కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు, బ్యాంక్ రికార్డులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ దాడులు జేపీ ఇన్ ఫ్రాటెక్, జైప్రకాష్ అసోసియేట్స్ వాటి అనుబంధ సంస్థలపై ఉన్న మనీ లాండరింగ్, ఆస్తుల మళ్లింపు, అక్రమ ఫండ్ల వినియోగంపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగమని చెప్పవచ్చు.
నిధులను అక్రమంగా ఇతర ప్రాజెక్టులకు మళ్లింపు
ఈడి దర్యాప్తు ప్రకారం.. జేపీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ గృహ ప్రాజెక్టుల కోసం హోమ్ బయ్యర్ల నుండి సేకరించిన నిధులను అక్రమంగా ఇతర ప్రాజెక్టులకు మళ్లించింది. దీని ఫలితంగా, వేలాదిమంది గృహ కొనుగోలుదారులు ఇళ్ల కోసం చెల్లించిన డబ్బును తిరిగి పొందలేక ఇబ్బందుల్లో పడ్డారు. 2017లోనే జేపీ ఇన్ ప్రాటెక్ పై అనేక గృహ కొనుగోలుదారులు ఎఫ్ ఐఆర్ లు నమోదు చేయించారు. ఈ కంపెనీ తమ నిధులను ఇతర ప్రాజెక్టులకు మళ్లించిందని, సమయానికి ప్లాట్లు అందించలేదని ఆరోపించారు. ఈ కేసులు తరటువాత సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని ఇన్ సాల్వెన్సీ ప్రాసెస్ కింద దర్యాప్తు దశకు చేరాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: