📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

J&K: జమ్మూకశ్మీర్‌లో ఆకస్మిక వరదల్లో దుర్మరణం చెందిన యాత్రికులు

Author Icon By Anusha
Updated: August 15, 2025 • 2:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా, చసోటి గ్రామం పరిసర ప్రాంతం నిన్న మధ్యాహ్నం ఘోర విషాదానికి వేదికైంది.ఏదో బాంబు పేలినట్టు పెద్ద శబ్దం వినిపించింది. ‘పరుగెత్తండి, పరుగెత్తండి’ అంటూ అందరూ ప్రాణభయంతో కేకలు పెట్టారు” అంటూ జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో జరిగిన ఘోర ప్రమాదాన్ని కన్నీళ్లతో వివరించారు షాలూ మెహ్రా అనే మహిళ. నిన్న మధ్యాహ్నం మచైల్ మాతా యాత్ర మార్గంలో ఆకస్మికంగా సంభవించిన వరద బీభత్సం నుంచి ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటనలో దాదాపు 60 మంది యాత్రికులు మరణించినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సహాయక బృందాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.కిష్త్వార్ జిల్లా (Kishtwar District) లోని చసోటి గ్రామం వద్ద యాత్రికులు పుణ్యక్షేత్రానికి ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో ఈ జల ప్రళయం సంభవించింది. వర్షం నుంచి తలదాచుకునేందుకు కొందరు, భోజనం చేసేందుకు మరికొందరు యాత్రికులు స్థానికంగా ఏర్పాటు చేసిన ఉచిత భోజనశాల (లంగర్)లో ఆశ్రయం పొందారు. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా భారీ బండరాళ్లు, చెట్లతో కూడిన వరద ప్రవాహం ఒక్కసారిగా ఆ భోజనశాలను ముంచెత్తింది.

లాంటిది జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు

అంతా క్షణాల్లో జరిగిపోయింది. ప్రవాహం దారిలో ఉన్న ప్రతీదాన్ని చదును చేసుకుంటూ వెళ్లిపోయింది. నేను శిథిలాల్లో చిక్కుకుపోగా, ఓ కరెంట్ స్తంభం నా తలపై పడింది. వెంటనే నా కూతురిని పిలిచాను. తనే నన్ను బయటకు లాగింది” అని షాలూ మెహ్రా ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు. అక్కడి నుంచి బయటపడ్డాక, తనకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన కుమారుడి కోసం వెతకడం ప్రారంభించినట్టు ఆమె చెప్పారు.ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన సంజయ్ కుమార్ (Sanjay Kumar) అనే మరో భక్తుడు మాట్లాడుతూ “కొన్ని క్షణాల ముందే 15 మంది యాత్రికులు నాలుగు వాహనాల నుంచి కిందకు దిగారు. చూస్తుండగానే ఆ వాహనాలు ఆటబొమ్మల్లాగా బోల్తాపడి వరదలో కొట్టుకుపోయాయి. ఇలాంటిది జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు” అని అన్నారు. ఈ ఘటనలో సంజయ్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలవడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

ఒక్కసారిగా పెద్ద కేకలు వినిపించాయి

భోజనశాల నిర్వాహకుడు సుభాష్ చందర్ గుప్తా మాట్లాడుతూ “అందరికీ భోజనం వడ్డిస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద కేకలు వినిపించాయి. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. నేను ఓ పెద్ద బండరాయి కింద ఇరుక్కుపోయాను. దాదాపు మూడు గంటల పాటు అలాగే ఉండిపోయాను” అని ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకున్నారు. చసోటి గ్రామం నుంచే పుణ్యక్షేత్రానికి 8.5 కిలోమీటర్ల తుది యాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడే ఈ విషాదం చోటుచేసుకోవడంతో యాత్రికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

జమ్మూ కశ్మీర్‌లో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు ఏవి?

శ్రీనగర్ దాల్ సరస్సు, గుల్మర్గ్, పహల్‌గామ్, సోనమార్గ్, అమర్నాథ్ గుహ, మచైల్ మాతా వంటి ప్రదేశాలు ప్రసిద్ధి చెందాయి.

జమ్మూ కశ్మీర్‌ ప్రత్యేకత ఏమిటి?

ప్రకృతి సౌందర్యం, మంచుతో కప్పబడి ఉండే పర్వతాలు, ఆపిల్ తోటలు, కుంకుమ పువ్వు (సాఫ్రన్) సాగు, అలాగే ప్రత్యేకమైన కాశ్మీరీ హస్తకళలు జమ్మూ కశ్మీర్ ప్రత్యేకతలు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/pm-narendra-modi-good-news-to-nation/national/530472/

Breaking News chasoti village disaster jammu kashmir flash flood kishwar accident kishwar flash flood latest news machail mata pilgrims death machail mata yatra

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.