Jharkhand Plane Crash: కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్

Read Time:  1 min
Jharkhand Plane Crash: కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్
FONT SIZE
GET APP

Jharkhand Plane Crash: జార్ఖండ్ రాష్ట్రంలో సోమవారం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగిని తరలిస్తున్న ఓ ఎయిర్ అంబులెన్స్ సాంకేతిక కారణాలతో కుప్పకూలింది. రాంచీ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తున్న సమయంలో ఛాత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ విమానం కూలిపోయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. విమానం గాలిలో ఉండగానే నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది.

Read also: Railway Parcel Booking: ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!

Jharkhand Plane Crash: Air ambulance crashes
Jharkhand Plane Crash: Air ambulance crashes

విమానంలో ఏడుగురు ప్రయాణికులు

ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం ఏడుగురు ఉన్నారు.. వీరిలో పైలట్లు, వైద్య సిబ్బందితో పాటు రోగి, పారామెడిక్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. విమానం ఒక్కసారిగా కూలిపోవడంతో అందులో ఉన్న వారి పరిస్థితిపై ప్రస్తుతం తీవ్ర ఆందోళన నెలకొంది. సమాచారం మేరకు రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.