📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

Latest News: Jammu & Kashmir Crime: పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..ఏడుగురు మృతి

Author Icon By Aanusha
Updated: November 15, 2025 • 8:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir Crime) లో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. శ్రీనగర్ లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, సుమారు 30 మందికి పైగా గాయపడ్డారు.గాయపడగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Read Also: Bihar Election Results: ఎన్డీఏ విజయానికి అసలు కారణాలు ఇవే !!

చనిపోయిన వారిలో ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది..పేలుడు భవనం నుంచి వెలువడినట్లు, అలాగే పేలుడు సమయంలో భారీ మంటలు చెలరేగినట్లు ప్రత్యేక్ష సాక్షులు,సీసీ పుటేజీల ద్వారా తెలుస్తోంది.భవనంలో దట్టమైన పొగతో గాల్లోకి మంటలు ఎగిసిపడినట్లు తెలుస్తోంది.

అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను సరి చేసేటప్పుడు ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద మాడ్యూల్ నుండి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పరిశీలిస్తుండగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏదైనా ఉగ్రవాద ఘటన చేసుకుందా? అనే దానిపై కూడా పరిశీలిస్తున్నారు.

పేలుడు పదార్థాలను నిర్వహిస్తుండగా పేలుడు జరిగింది

పోలీసులు ఫోరెన్సిక్ బృందాలు ఫరీదాబాద్ నుండి తీసుకువచ్చిన పేలుడు పదార్థాలను నిర్వహిస్తుండగా పేలుడు జరిగింది. టెర్రర్ మాడ్యూల్ కేసు నుండి స్వాధీనం చేసుకున్న 360 కిలోల స్టాక్‌లో ఎక్కువ భాగం పోలీస్ స్టేషన్ లోపల ఉంచారు పోలీసులు. స్వాధీనం చేసుకున్న రసాయనాలలో కొన్నింటిని పోలీసు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు పోలీసులు.

కానీ ఎక్కువ భాగం స్టేషన్‌లోనే ఈ పేలుడు పదార్థాలను ఉంచారు. పేలుడు ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను శ్రీనగర్‌లోని పోలీసు కంట్రోల్ రూమ్‌కు తరలించారు. రెండు కోణాల్లో నౌగామ్ పోలిస్టేషన్ పేలుడు ను దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన పోలీసు వర్గాలు తెలిపాయి.మేజిస్ట్రేట్ సమక్షంలో సీలింగ్ చేస్తున్నప్పుడు అమ్మోనియం నైట్రేట్ మండి పేలుడు జరగవచ్చని తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Breaking News latest news Nowgam Police Station Blast Srinagar Explosion Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.