📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Jaish-e-Mohammed: బాబోయ్.. డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్.

Author Icon By Anusha
Updated: November 13, 2025 • 1:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వద్ద జరిగిన భయానక పేలుడు ఘటన వెనుక భారీ ఉగ్రవాద కుట్ర ఉందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా షాక్‌కు గురి చేసింది ఈ ఘటన. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా వచ్చే నెల 6న ఢిల్లీ– ఎన్సీఆర్ పరిధిలో ఆరేడు చోట్ల పేలుళ్లు జరపాలని ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు తేలింది.

Read Also: Breaking News: లిబియాలో పడవ బోల్తా 42 మంది గల్లంతు

ఈ కుట్రను అమలు పరిచే క్రమంలో కారులో అసాల్ట్ రైఫిల్ తో ఓ డాక్టర్ పట్టుబడడం, మిగతా ఉగ్రవాదులనూ పోలీసులు అరెస్టు చేయడంతో పేలుళ్ల ప్లాన్ బెడిసికొట్టింది. సహచరులంతా పట్టుబడడంతో డాక్టర్ ఉమర్ మొహమ్మద్ ఎర్రకోట వద్ద కారులో ఆత్మాహుతి దాడి చేశాడని అధికారులు తెలిపారు.

1992 డిసెంబర్ 6న ఢిల్లీలోని బాబ్రీ మసీదు (Babri Masjid) ను కరసేవకులు కూల్చివేసిన విషయం తెలిసిందే. రామజన్మభూమిలో మసీదు నిర్మించారనే ఆరోపణలతో కరసేవకులు ఈ కూల్చివేతకు పాల్పడ్డారు. దీనిపై పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) సంస్థ పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది.

ఉగ్రవాదులు ఢిల్లీలోని పలు ప్రాంతాలలో రెక్కీ

బాబ్రీ కూల్చివేతకు ప్రతీకారంగా భారత్ లో పేలుళ్లకు పాల్పడతామని తెలిపింది. తాజాగా వచ్చే నెల 6వ తేదీన ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలో పేలుళ్లకు ప్లాన్ చేసింది. పోలీసులకు పట్టుబడక ముందు ఉగ్రవాదులు ఢిల్లీలోని పలు ప్రాంతాలలో రెక్కీ నిర్వహించినట్లు తేలింది.

ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ మహ్మద్ ఎరుపు రంగు కారులో ఎర్రకోటతో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించాడని పట్టుబడిన ఉగ్రవాదులు వెల్లడించినట్లు సమాచారం. డాక్టర్లు కావడంతో వారిని ఎవరూ అనుమానించలేదని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే పేలుళ్లకు అవసరమైన ఐఈడీ సహా ఇతరత్రా ఏర్పాట్లను ఉగ్రవాదులు పకడ్బందీగా చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కారులో అసాల్ట్ రైఫిల్ తో డాక్టర్ పట్టుబడడంతో ఈ ఉగ్రవాద డొంక కదిలిందని, మిగతా ఉగ్రవాదులు పట్టుబడడంతో పేలుళ్ల కుట్ర భగ్నమైందని అధికారులు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

delhi blast latest news Red Fort Explosion Telugu News Terrorism in India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.