మహేందర్‌గౌడ్ (33) ఇన్‌స్టాగ్రామ్‌లో సంధ్య అనే IDతో జగిత్యాల(Jagityala crime) పట్టణానికి చెందిన బైరవేని సమతతో స్నేహం ఏర్పరచాడు. అతను ఒకే కులానికి చెందినట్లు, ఇంకా పెళ్లి కాలేదని నమ్మించి, సమత సోదరి సంధ్య ఫోన్‌ను హ్యాక్ చేసి, ఆమె వాట్సాప్ గ్రూప్‌లో చేర్చాడు.
Read Also: Obulavaripalle Accident: మహిళ ప్రాణాలు తీసిన పొగ మంచు
ఆన్‌లైన్ బెదిరింపుతో కుట్ర
తరువాత, సమతకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసిన మహేందర్, తనను పెళ్లి చేసుకోవాలని లేకుంటే ఫోటోలు మార్ఫ్(Photos morph) చేసి పంపిస్తానని బెదిరించాడు. ఈ బెదిరింపుల నేపథ్యంలో, సమత మరియు సంధ్య తమ మేనమామ నరేశ్‌కు విషయాన్ని తెలియజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నరేశ్, సంధ్య కొడుకు రాజశేఖర్ మరియు అతని స్నేహితులు మహేందర్‌ను హత్య చేయాలని పథకం వేసి అమలు చేసినట్లు తెలుస్తోంది.
మృతుని తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను ఆదివారం లక్ష్మీపూర్ గ్రామ శివారులో అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో లక్ష్మీపూర్‌కు చెందిన గర్వందుల సంధ్య, గర్వందుల రాజశేఖర్, గర్వందుల నరేశ్, శంకులపల్లికి చెందిన బైరవేని సమతలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. దీంతో పాటు, వారి వద్ద నుంచి స్కోడా కారు, స్కూటీ, ఇనుపరాడ్, కర్ర, ఐదు మొబైల్‌ఫోన్లు స్వాదీనం చేసుకున్నట్ల తెలిపారు. కాగా, హత్య కేసులో ఉన్న నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: