హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు ను సీఐడీ (CID) అధికారులు అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలతో ఎన్నికల్లో పాల్గొని అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారన్న ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఆయనతో పాటు మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.సీఐడీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం,శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్‌రావు నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ క్లబ్ ప్రెసిడెంట్ (Club President) గా ఉన్న కవిత, గౌలిపురా క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి సి. కృష్ణయాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ పత్రాలను జగన్మోహన్‌రావుకు అందజేశారు.
ఈ వ్యవహారం
వాటిని ఆధారంగా చేసుకుని ఆయన హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.ఆ తర్వాత హెచ్‌సీఏ (HCA) లో నిధుల దుర్వినియోగం జరిగిందని టీసీఏ అధ్యక్షుడు గురువారెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ మోసంలో జగన్మోహన్‌రావుకు హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, సీఈవో సునీల్ సహకరించినట్లు దర్యాప్తులో తేలిందని సీఐడీ పేర్కొంది. దీంతో జగన్మోహన్‌రావు (Jagan Mohan Rao), శ్రీనివాసరావు, సునీల్, రాజేందర్ యాదవ్‌తో పాటు ఫోర్జరీకి పాల్పడిన కవితను కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
జగన్మోహన్‌రావు HCA అధ్యక్షుడిగా ఎలా ఎన్నికయ్యారు?
అతను హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. కానీ, ఇప్పుడు నకిలీ పత్రాల ఆధారంగా పదవిని పొందినట్లు ఆరోపణలు రావడంతో కేసు విచారణ జరుగుతోంది.
ఈ కేసులో ఆయనపై ఏ ఆరోపణలు ఉన్నాయి?
అతను నకిలీ క్లబ్ డాక్యుమెంట్లు, సంతకాలు ఉపయోగించి హెచ్‌సీఏ ఎన్నికల్లో పాల్గొని అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Jasmine Kaur: డోపింగ్ లో పట్టుబడిన జాస్మిన్ కౌర్‌పై వేటు