Jadcherla Crime: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. రోడ్డుపై వెళ్తున్న బైకర్లను లిఫ్ట్ అడిగిన ఒక మహిళపై ఇద్దరు కామాంధులు పాశవికానికి ఒడిగట్టారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఆటో కోసం వేచి చూస్తున్న బాధితురాలు, అటుగా వెళ్తున్న బైక్‌ను ఆపి లిఫ్ట్ అడగగా, దానిపై ఉన్న ఇద్దరు యువకులు ఆమెను ఎక్కించుకున్నారు.
Read Also: Viveka Murder Case: సునీతా రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
అయితే, బైక్ మున్సిపాలిటీ దాటగానే నిందితులు తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తరలించి, బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుండి అతికష్టమ్మీద తప్పించుకున్న బాధితురాలు నేరుగా జడ్చర్ల పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘోరాన్ని వివరించింది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పట్టణ పరిసరాలను జల్లెడ పడుతున్నారు. మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తున్న ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: