📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Islamabad Blast: మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి

Author Icon By Pooja
Updated: February 6, 2026 • 4:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో(Islamabad Blast) శుక్రవారం తీవ్ర పేలుడు చోటుచేసుకుంది. శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఒక మసీదులో బాంబు పేలినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం కాగా, పదుల సంఖ్యలో భక్తులు గాయపడినట్లు వెల్లడైంది.

Read Also: Pakistan Army: బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

ప్రాథమికంగా ఇది ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో మసీదు పరిసరాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఘటనాస్థలికి పోలీసులు, సైన్యం, రెస్క్యూ బృందాలు భారీగా చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.

అత్యవసర పరిస్థితి – ఆస్పత్రుల్లో హై అలర్ట్

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఇస్లామాబాద్(Islamabad Blast) గ్రాండ్ మసీదుగా పిలవబడే కస్ర్-ఎ-ఖాదీజతుల్ కుబ్రా మసీదులో ఈ పేలుడు జరిగింది. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్రమత్తత చర్యల్లో భాగంగా ఇస్లామాబాద్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు సమాచారం.

గాయపడిన వారిని పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS), CDA ఆస్పత్రులకు తరలించారు. పిమ్స్ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ ప్రకటించి, ట్రామా, ఆర్థోపెడిక్, బర్న్, న్యూరాలజీ విభాగాలను సిద్ధం చేసినట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఈ దాడికి బాధ్యులుగా ఏ సంస్థ లేదా గ్రూప్ బాధ్యత వహించలేదు.ఈ ఘటనలో 12 మంది చనిపోయారు. మరో 20 మంది గాయపడ్డారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu MosqueAttack PakistanNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.