📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest Telugu News: IPS: చండీగఢ్‌లో ఘోరం .. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని IPS ఆఫీసర్ ఆత్మహత్య

Author Icon By Vanipushpa
Updated: October 7, 2025 • 4:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

IPS (IPS) ఆఫీసర్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన చండీగఢ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. హర్యానా క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి వై. పూరణ్ కుమార్ (Puran Kumar) ఆయన ఇంట్లో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. ఆయన ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సెక్టార్ 11లోని తమ నివాసంలో పూరణ్ కుమార్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని మృతి చెందారు. కాల్పుల శబ్దం బయటకు వినిపించకుండా ఉండేందుకు ఆయన ఇంటి బేస్‌మెంట్‌లో ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. చాలాసేపటి తర్వాత ఆయన కూతురు బేస్‌మెంట్‌కు వెళ్లి చూడగా, తండ్రి మృతదేహం పడి ఉంది. ఆమె పోలీసులకు సమాచారం అందించారు.

VC Sajjanar: మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక జైలుకే: సీపీ సజ్జనార్

చండీగఢ్‌లో ఘోరం .. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని IPS ఆఫీసర్ ఆత్మహత్య

జపాన్ పర్యటనలో వున్న భార్య

పూరణ్ కుమార్ భార్య, హర్యానా క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి అయిన అమ్నీత్ పి. కుమార్ ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో లేరు. ఆమె ప్రస్తుతం హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలో ఓ అధికారిక ప్రతినిధి బృందంతో కలిసి జపాన్ పర్యటనలో ఉన్నారు. వై. పూరణ్ కుమార్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆయన సర్వీస్ రివాల్వర్‌ను సోమవారం తన గన్‌మ్యాన్ నుండి తీసుకున్నట్లు తెలుస్తోంది. వై.పూరణ్ కుమార్ తన కెరీర్‌లో సీనియారిటీ, అంతర్గత వ్యవహారాలపై తరచుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని హోం మంత్రి అనిల్ విజ్‌కు కూడా పలుమార్లు లేఖలు రాశారని తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు ప్రారంభించారు. సీనియర్ పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకోవడం ఉన్నతాధికారులను, సహోద్యోగులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలియనున్నాయి.

IPS యొక్క అత్యున్నత ర్యాంక్ ఏమిటి?
పోలీస్ ర్యాంక్ ఆర్డర్ , 1. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP), స్టార్- అశోక్ చిహ్నం, క్రాస్ స్వోర్డ్స్ & IPS బ్యాడ్జ్, సగటు జీతం: INR 14.30 LPA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఒక రాష్ట్రంలో IPS (ఇండియన్ పోలీస్ సర్వీస్) అధికారికి అత్యున్నత ర్యాంక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP). ఈ పదవి రాష్ట్ర పోలీసు దళానికి అధిపతిగా పనిచేస్తుంది మరియు దాని మొత్తం పరిపాలన మరియు పనితీరును పర్యవేక్షిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Chandigarh news Indian Police Service IPS officer death IPS officer suicide law enforcement stress mental health in police police suicide case service revolver incident Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.