Investment Scam: నిర్మల సీతారామన్ పేరుతో నకిలీ పెట్టుబడి మోసం

Read Time:  1 min
Investment Scam
Investment Scam
FONT SIZE
GET APP

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఓ ప్రత్యేక పెట్టుబడి పథకాన్ని ప్రారంభించారని సోషల్ మీడియాలో విస్తృతంగా తప్పుడు ప్రచారం జరుగుతోంది. కేవలం రూ.21 వేల పెట్టుబడి పెడితే మూడు రోజుల్లోనే రూ.20 లక్షల వరకు లాభం వస్తుందంటూ ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Read Also: Anantapur crime news : అనంతలో దారుణం, తల్లి–కొడుకు హత్యల వెనుక ఆస్తి తగాదా?

Investment Scam

ప్రజలను ఆకర్షించేలా నకిలీ ప్రకటనలు

ఈ తప్పుడు ప్రచారంలో ప్రభుత్వ ముద్రలు, ప్రముఖుల ఫోటోలు, న్యూస్ క్లిప్పింగ్స్ లాంటి అంశాలను ఉపయోగించి నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణ ప్రజలు సులభంగా మోసపోయేలా ఈ ప్రకటనలను రూపొందిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ అంశంపై PIB Fact Check స్పష్టంగా(Investment Scam) స్పందించింది. కేంద్ర ఆర్థిక మంత్రి గానీ, భారత ప్రభుత్వం గానీ ఇలాంటి పెట్టుబడి పథకాన్ని ఎప్పుడూ ప్రకటించలేదని స్పష్టం చేసింది. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని పేర్కొంది.

ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రకటన

భారత ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఈ నకిలీ పెట్టుబడి స్కీమ్‌తో ఎలాంటి సంబంధం లేదని PIB స్పష్టం చేసింది. ప్రజలు ఈ తరహా సోషల్ మీడియా పోస్టులను నమ్మవద్దని, ఎలాంటి లావాదేవీలు చేయవద్దని(Investment Scam) హెచ్చరించింది. ఇలాంటి స్కీమ్‌ల వెనుక ఉన్న మోసగాళ్లు ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని డబ్బులు కొట్టేస్తున్నారని అధికారులు తెలిపారు. ఎటువంటి పెట్టుబడి అవకాశమైనా అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్లు లేదా నమ్మకమైన వనరుల ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలని సూచించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.