తమ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వచ్చేలా నమ్మబలికిన ఒక ప్రైవేట్ సంస్థ భారీ దందా చేసి పెట్టుబడిదారులను(Investment Fraud) మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక్కసారి రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే,
- ఒక గుంట భూమి రిజిస్ట్రేషన్,
- 25 నెలలపాటు నెలకు రూ.16,000 వడ్డీ,
- కాలవ్యవధి పూర్తయిన తర్వాత రూ.8 లక్షలు తిరిగి చెల్లింపు
అనే ఆఫర్‌తో ప్రజలను ఆకర్షించి భారీ మొత్తాలను సేకరించినట్లు తెలుస్తోంది. అయితే కొంత మందికే వడ్డీ చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసిన భూమి అసలు లేదని బయటపడటంతో బాధితులు మోసపోయామని గ్రహించారు. దీంతో నల్లగొండలో సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
Read Also: iBomma : పోలీసుల ‘టెక్నికల్ ఆఫర్’ ను తిరస్కరించిన రవి కథ
ఇప్పటికే కేసులు – వెయ్యిలాది మంది మోసపోవడం
ఈ సంస్థపై గతంలోనే హైదరాబాద్‌లోని ఆర్థిక నేరాల విభాగంలో కేసు నమోదైందని సమాచారం. “12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్” పేరుతో కూకట్‌పల్లిలో ఈ సంస్థను రెండేళ్ల(Investment Fraud) క్రితం ప్రారంభించారు. అధిక వడ్డీ అనే ఎరతో సాధారణ ప్రజలతో పాటు కొంతమంది ఉద్యోగులు, అధికారులు కూడా పెట్టుబడులు పెట్టారు. బాధితుల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మందిలో నుంచి సుమారు రూ.330 కోట్లు ఈ సంస్థ సేకరించినట్లు చెబుతున్నారు.
నకిలీ రిజిస్ట్రేషన్లు – ఏజెంట్ల దందా
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలంలోని రాంసాగర్‌పల్లి ప్రాంతం భూములకు బై నంబర్లు ఉన్నట్లు చూపించి, వంద రూపాయల బాండ్ పేపర్‌పై గుంట భూమి కేటాయింపుల అగ్రిమెంట్‌లు ఇచ్చారని బాధితులు తెలిపారు. అయితే ఇవన్నీ నకిలీవని బయటపడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 300 మందికి పైగా పెట్టుబడిదారులను ఏజెంట్లు ఈ స్కీమ్‌లో చేర్చారని తెలుస్తోంది. వడ్డీ కొందరికే చెల్లించిన తర్వాత భూకేటాయింపు కూడా చూపకపోవడంతో బాధితులు ఇటీవల సంస్థ లీగల్ అడ్వైజర్ రాపోలు ప్రకాశ్ ఇంటి ముందు ఆందోళన చేశారు. పోలీసులు అతన్ని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా, బాధితులు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని బాధితులు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌కు ఫిర్యాదు చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: