हिन्दी | Epaper
కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

Telugu News: Investment Fraud: లాభాల పేరుతో భారీ మోసం .. స్కామ్‌పై బాధితుల ఆగ్రహం

Pooja
Telugu News: Investment Fraud: లాభాల పేరుతో భారీ మోసం .. స్కామ్‌పై బాధితుల ఆగ్రహం

తమ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వచ్చేలా నమ్మబలికిన ఒక ప్రైవేట్ సంస్థ భారీ దందా చేసి పెట్టుబడిదారులను(Investment Fraud) మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక్కసారి రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే,

  • ఒక గుంట భూమి రిజిస్ట్రేషన్,
  • 25 నెలలపాటు నెలకు రూ.16,000 వడ్డీ,
  • కాలవ్యవధి పూర్తయిన తర్వాత రూ.8 లక్షలు తిరిగి చెల్లింపు

అనే ఆఫర్‌తో ప్రజలను ఆకర్షించి భారీ మొత్తాలను సేకరించినట్లు తెలుస్తోంది. అయితే కొంత మందికే వడ్డీ చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసిన భూమి అసలు లేదని బయటపడటంతో బాధితులు మోసపోయామని గ్రహించారు. దీంతో నల్లగొండలో సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

Read Also:  iBomma : పోలీసుల ‘టెక్నికల్‌ ఆఫర్’ ను తిరస్కరించిన రవి కథ

Investment Fraud
Investment Fraud: Huge fraud in the name of profits.. Victims angry over scam

ఇప్పటికే కేసులు – వెయ్యిలాది మంది మోసపోవడం

ఈ సంస్థపై గతంలోనే హైదరాబాద్‌లోని ఆర్థిక నేరాల విభాగంలో కేసు నమోదైందని సమాచారం. “12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్” పేరుతో కూకట్‌పల్లిలో ఈ సంస్థను రెండేళ్ల(Investment Fraud) క్రితం ప్రారంభించారు. అధిక వడ్డీ అనే ఎరతో సాధారణ ప్రజలతో పాటు కొంతమంది ఉద్యోగులు, అధికారులు కూడా పెట్టుబడులు పెట్టారు. బాధితుల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మందిలో నుంచి సుమారు రూ.330 కోట్లు ఈ సంస్థ సేకరించినట్లు చెబుతున్నారు.

నకిలీ రిజిస్ట్రేషన్లు – ఏజెంట్ల దందా

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలంలోని రాంసాగర్‌పల్లి ప్రాంతం భూములకు బై నంబర్లు ఉన్నట్లు చూపించి, వంద రూపాయల బాండ్ పేపర్‌పై గుంట భూమి కేటాయింపుల అగ్రిమెంట్‌లు ఇచ్చారని బాధితులు తెలిపారు. అయితే ఇవన్నీ నకిలీవని బయటపడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 300 మందికి పైగా పెట్టుబడిదారులను ఏజెంట్లు ఈ స్కీమ్‌లో చేర్చారని తెలుస్తోంది. వడ్డీ కొందరికే చెల్లించిన తర్వాత భూకేటాయింపు కూడా చూపకపోవడంతో బాధితులు ఇటీవల సంస్థ లీగల్ అడ్వైజర్ రాపోలు ప్రకాశ్ ఇంటి ముందు ఆందోళన చేశారు. పోలీసులు అతన్ని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా, బాధితులు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని బాధితులు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌కు ఫిర్యాదు చేశారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870