📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Indiramma Indla scam: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇల్లీగల్ వసూళ్లు.. కాంగ్రెస్ నేతపై కేసు!

Author Icon By Tejaswini Y
Updated: March 2, 2026 • 11:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహబూబ్నగర్ జిల్లా: పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని కొందరు నేతలు స్వార్థానికి వాడుకుంటున్నారు. ఇళ్లు మంజూరు చేయిస్తామని(Indiramma Indla scam) నమ్మించి సామాన్యుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, మహబూబ్నగర్ జిల్లాలో ఓ టీపీసీసీ కో-ఆర్డినేటర్ బాధితుడిని లంచం కోసం వేధించిన ఘటన సంచలనం రేపుతోంది.

Read Also: Priyanka Gandhi: ఇది అత్యంత హేయమైన చర్య

Indiramma Indla scam: Illegal collection in the name of Indiramma’s houses.. Case against Congress leader!

అసలేం జరిగిందంటే?

నవాబుపేట మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గూళ్ళ కేశవులు అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని టీపీసీసీ కో-ఆర్డినేటర్ ధారా భాస్కర్ నమ్మబలికాడు. ఇందుకు ప్రతిఫలంగా రూ. 1,00,000 (అక్షరాలా లక్ష రూపాయలు) చెల్లించాలని డిమాండ్ చేశాడు. పథకం మంజూరు కావాలంటే ముందస్తుగా కొంత చెల్లించాలని ఒత్తిడి చేయడంతో, బాధితుడు కేశవులు గత ఏడాది ధారా భాస్కర్‌కు రూ. 50,000 అందజేశాడు. అయితే, మిగతా రూ. 50,000 కూడా చెల్లించాలని భాస్కర్ గత కొంతకాలంగా బాధితుడిపై వేధింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది.

పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు

డబ్బులు ఇవ్వకపోతే ఇల్లు రాకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడటంతో విసిగిపోయిన బాధితుడు కేశవులు, పోలీసులను ఆశ్రయించాడు. తన వద్ద నుంచి ఇప్పటికే యాభై వేలు వసూలు చేశారని, ఇంకా డబ్బులు కావాలని వేధిస్తున్నారని పోలీసులకు వివరించాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి, టీపీసీసీ కో-ఆర్డినేటర్ ధారా భాస్కర్‌పై కేసు నమోదు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Dhara Bhaskar Indiramma Indla scam Mahabubnagar District ndiramma Indlu TPCC Coordinator

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.