📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

IBOMMA: ఇమ్మడి రవి వెనుక ఉన్న ప్రహ్లాద్ ఎవరు?

Author Icon By Tejaswini Y
Updated: December 19, 2025 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Cyber Crime Hyderabad: సినీ పైరసీ సామ్రాజ్యాన్ని ఏలిన ఐబొమ్మ(IBOMMA) నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని తీవ్రంగా విచారిస్తున్నారు. ప్రముఖ పైరసీ ప్లాట్‌ఫామ్‌గా పేరుగాంచిన ఐబొమ్మ కేసును పోలీసులు అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ అక్రమ సామ్రాజ్యం వెనుక ఎవరున్నారు? ఎలా నడిపించారనే అంశాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

Read also: Cyber Crime: చైనా నేరగాడితో దోస్తీ చేసిన ముంబయి సైబర్ నేరస్థుడు అరెస్టు

నాంపల్లి కోర్టు(Nampally Court) ఆదేశాల మేరకు ఇమ్మడి రవిని 12 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించారు. గురువారం మధ్యాహ్నం నుంచి సైబర్ క్రైమ్ అధికారుల కస్టడీలో ఉన్న రవిపై వరుసగా ప్రశ్నలు సంధిస్తున్నారు. తొలి రోజు విచారణలో రవి ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రసాద్, ప్రహ్లాద్ అనే పేర్లు రావడంతో పోలీసులు వారి పాత్రపై దృష్టి సారించారు.

IBOMMA: Who is the Prahlad behind Immadi Ravi?

ప్రహ్లాద్ ఎవరు? రవి వెనుక ఉన్న అసలు వ్యక్తి కోసం గాలింపు

ప్రసాద్ అనే వ్యక్తి విశాఖపట్నానికి చెందినవాడని, రవికి పదో తరగతి నాటి స్నేహితుడని దర్యాప్తులో తేలింది. ఇప్పటికే ప్రసాద్‌ను ప్రశ్నించిన పోలీసులు అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే ప్రహ్లాద్ అనే వ్యక్తి విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. రవి మొదట అతని వివరాలు తెలియవని చెప్పగా, అనంతరం అమీర్‌పేట(Ameerpet)లో కోచింగ్ తీసుకున్న సమయంలో పరిచయమైన ప్రహ్లాద్ కుమార్ అని వెల్లడించి మళ్లీ వివరాలు తెలియవని చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ప్రహ్లాద్ పేరుతో పౌరసత్వం కూడా?

అయితే ప్రహ్లాద్ పేరుతోనే కీలక డాక్యుమెంట్లు వినియోగించబడటం అనుమానాలకు తావిస్తోంది. ఐ బొమ్మ రవికి సంబంధించిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే కాకుండా కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పౌరసత్వం కూడా అదే పేరుతో తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. అంతేకాదు, ఐ బొమ్మ వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్ కూడా ప్రహ్లాద్ పేరుతోనే జరిగినట్లు దర్యాప్తులో బయటపడింది.

దీంతో అసలు ప్రహ్లాద్ అనే వ్యక్తి నిజంగా ఉన్నాడా? ఉంటే అతని పాత్ర ఏంటి? పైరసీ నెట్‌వర్క్‌లో అతను కీలకంగా వ్యవహరించాడా? లేక కేసును తప్పుదారి పట్టించేందుకు రవి కల్పిత పేరును ఉపయోగిస్తున్నాడా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రహ్లాద్, ఇమ్మడి రవి ఇద్దరూ ఒకరేనా? లేదా ప్రహ్లాద్ వ్యక్తిగా వ్యవహరించాడా? అన్న అంశాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. 12 రోజుల పాటు కస్టడీలో ఉంచి విచారించనున్న పోలీసులు, ఈ సినీ పైరసీ సామ్రాజ్యం వెనుకున్న మొత్తం నెట్‌వర్క్‌ను బయటపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

cyber crime Hyderabad Cyber Crime Investigation iBomma Immdi Ravi movie piracy piracy website Telugu movie piracy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.