ఐబొమ్మ( iBomma) రవికి సంబంధించిన కస్టడీ రిపోర్ట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. 12 రోజుల పాటు నిర్వహించిన విచారణలో పలు కీలక విషయాలు వెలికితీసినట్లు పోలీసులు వెల్లడించారు. సినిమాలను రవి వేర్వేరు ఫార్మాట్లలో కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. క్యామ్‌కార్డర్ ద్వారా తీసిన ప్రింట్‌కు ఒక ధర చెల్లించగా, హెచ్‌డీ ప్రింట్‌కు మరో ధర ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
TeluguCinema: నువ్వు నాకు నచ్చావ్’కు 25 ఏళ్లు.. జనవరి 1న గ్రాండ్ రీ రిలీజ్
దర్యాప్తు సమయంలో రవి నిర్వహించిన బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా, వాటిలోకి మొత్తం రూ.13.40 కోట్ల మేర లావాదేవీలు( iBomma) జరిగినట్లు గుర్తించారు. భారీ మొత్తంలో నిధులు అందడంతో విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడి, వినోదం కోసం ఇతర దేశాలకు ప్రయాణాలు చేసినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. ఈ వ్యవహారంపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోందని, సంబంధిత ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పూర్తిస్థాయి సమాచారం సేకరిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: