iBomma Ravi Controversy: ప్రఖ్యాత నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్(Damodar Prasad), ఐ-బొమ్మ రవి(iBomma Ravi)ని హీరోలా చూపించే ప్రయత్నాలకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రవి చేసిన పని పూర్తిగా తప్పు, దొంగతనం ఎంత నేరమో, దొంగ వస్తువులను కొనుగోలు చేయడం కూడా అంతే తప్పు అని.
ప్రతి ఏడాది 200కు పైగా చిత్రాలు విడుదల అవుతున్నప్పటికీ, టికెట్ ధరలు(Ticket Rates) పెరుగుతాయి కేవలం కొద్ది సంఖ్యలో ఉన్న పెద్ద సినిమాలకే అని తెలిపారు. మిగతా సినిమాలకు ఎలాంటి పెరుగుదల లేకపోయినా పైరసీ మాత్రం ఆగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: iBOMMA: రవిపై మరో 3 కేసులు, 14 రోజుల రిమాండ్
ప్రేక్షకులే పైరసీని ఆపాలి
ఐ-బొమ్మ రవి(iBomma Ravi) చేసిన చర్యను తప్పుబడిన ఆయన, ప్రజలు పైరసీ సినిమాల్ని చూడటం మానుకోవాలని సూచించారు. త్వరలో పరిస్థితులు మారే అవకాశం ఉందని, పైరసీపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలు కూడా రూపుదిద్దుకుంటాయని అన్నారు.
థియేటర్లలో కలెక్షన్లు పడిపోతున్నాయి
సినిమా పరిశ్రమను రక్షించుకోవడం చాలా అవసరమని దామోదర ప్రసాద్ పేర్కొన్నారు. టికెట్ రేట్ల పెంపు విషయంలో ఛాంబర్ కూడా పెద్దగా మద్దతు ఇవ్వడం లేదని వివరించారు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోవడంతో, శుక్రవారం పెంచిన టికెట్ రేట్లు సోమవారం తగ్గించాల్సిన పరిస్థితి వస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: