మూవీ పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవి(ibomma ravi)పై పోలీసులు రెండో రోజు విచారణ కొనసాగించారు. గురువారం చంచల్గూడ జైలు నుండి అతడిని సీసీఎస్ కార్యాలయానికి తీసుకువచ్చి ప్రశ్నించారు. విచారణలో భాగంగా రవి అందించిన యూజర్ ఐడీ(User ID), పాస్‌వర్డ్‌లతో క్లౌడ్ సర్వర్‌ను ఆక్సెస్ చేయగా, అందులో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్‌తో పాటు మొత్తం 21 వేల సినిమాలు నిల్వ ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
Read Also: Ibomma Ravi: అన్నింటికీ నేను బాధ్యుడిని కాదు
అలాగే అతని ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలపై కూడా దర్యాప్తు జరుపుతున్నారు. నిన్న వెబ్‌సైట్ నిర్వహణ, డేటా స్టోరేజ్ పై వివరాలు సేకరించగా, తాజాగా డొమైన్ కొనుగోలు బిల్లులు కూడా బయటపడ్డాయి. రవి(ibomma ravi)పై విచారణ మరో రెండురోజులు కొనసాగనున్నట్లు పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: