📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: iBomma: పోలీసులకే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఐబొమ్మ

Author Icon By Anusha
Updated: October 1, 2025 • 11:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు సినీ పరిశ్రమలో సినిమాల పైరసీ సమస్య ఎప్పటికీ కొత్త కాదన్నా, ఇటీవల జరుగుతున్న ‘ఐబొమ్మ’ (iBomma) వెబ్‌సైట్ వ్యవహారం ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది.సినిమాలు టైమ్‌కు విడుదల కాకుండా పిరసీ వెబ్‌సైట్‌లలో హల్‌చల్ అవ్వడం, ప్రేక్షకుల దగ్గర పరిక్షణల పెరుగుదలకు కారణమవుతుంది.

Dimple Hayathi: నటి డింపుల్ హయతిపై కేసు నమోదు

ఇప్పటివరకు సినీ నిర్మాతలను, హీరోలను బెదిరిస్తూ వచ్చిన ఈ సైట్ నిర్వాహకులు, ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ పోలీసులకే సవాల్ విసిరారు. తమపై దృష్టి సారిస్తే తాము కూడా పోలీసులపై దృష్టి పెట్టాల్సి వస్తుందంటూ బహిరంగంగా హెచ్చరించడం సంచలనం సృష్టిస్తోంది.ఇటీవల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC), ఐబొమ్మ సహా 65 పైరసీ వెబ్‌సైట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి ఒక పైరసీ (piracy) ముఠాను ఛేదించి ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, ఐబొమ్మ వంటి సైట్లను ఎంతటి సాంకేతికత వాడినా వదిలిపెట్టేది లేదని, అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారిని పట్టుకుంటామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

iBomma

మీరు మాపై ఫోకస్ చేస్తే.. మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది

సీపీ చేసిన ఈ హెచ్చరికలపై ఐబొమ్మ నిర్వాహకులు స్పందిస్తూ ఒక లేఖ విడుదల చేశారు. “మీరు మాపై ఫోకస్ చేస్తే.. మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది” అంటూ పోలీసులకే ఎదురు వార్నింగ్ ఇచ్చారు.పైరసీ కారణంగా కేవలం 2024లోనే తెలుగు చిత్ర పరిశ్రమకు సుమారు ₹3,700 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) తెలిపారు.

థియేటర్లలో రహస్యంగా చిత్రీకరించడం, డిజిటల్ సర్వర్లను హ్యాక్ చేసి హెచ్‌డీ ప్రింట్లను దొంగిలించడం వంటి పద్ధతుల్లో ఈ ముఠాలు పనిచేస్తున్నాయని వివరించారు. ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల ప్రకటనల ద్వారా

వీరికి కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని, ఈ లావాదేవీలన్నీ క్రిప్టోకరెన్సీ రూపంలో జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు.నిర్మాతలను బెదిరించిన పైరసీ సైట్లు ఇప్పుడు ఏకంగా పోలీసులకే సవాల్ విసురుతున్న నేపథ్యంలో, ఈ వ్యవహారాన్ని హైదరాబాద్ పోలీసులు ఎంత సీరియస్‌గా తీసుకుని ముందుకు వెళ్తారో వేచి చూడాలి. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Cyber Crime Hyderabad Police IBomma operators IBomma piracy latest news piracy website piracy website crackdown Telugu film industry loss Telugu News TFCC complaint

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.