వేలల్లో సినిమాలను పైరసీ చేసి, కోట్లాది రూపాయలను సంపాదించి, పోలీసులకే సవాలు విసిరిన ఐబొమ్మ రవిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) సినీ ప్రముఖులతో మీడియా సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సజ్జనార్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించడంపై మల్లన్న మండిపడ్డారు.
Read Also: TG: కెటిఆర్ ఆరోపణలు పూర్తిగా అసత్యం: మంత్రి శ్రీధర్ బాబు
ఐబొమ్మ (IBomma) రవి దమ్మున్నోడు అందుకే అతనికి ప్రజల మద్దతు ఉందని, వంద రూపాయల టికెట్ ను వేలల్లో అమ్ముకునే సినిమా వాళ్లు ఏమన్నా సంసారులా? సజ్జనార్ ను చూస్తే జాలేస్తుంది అని, నిన్ను చూసి నవ్వాలో ఏడ్వాలో అర్థం కావట్లేదు అని అన్నారు.
సినిమా డైలాగ్ లను మానుకో సజ్జనార్: మల్లన్న
అంతేకాక సినిమావాళ్లను పక్కన కూర్చోబెట్టుకుని సినిమా డైలాగ్ లు కొట్టడం మానుకోవాలని హితవు పలికారు. ఐబొమ్మ రవి గురించి అతడి భార్య హింట్ ఇవ్వకపోతే పోలీసులు ఏమాత్రం పట్టుకునేవారు కాదన్నారు. నీకు దమ్ముంటే సైబర్ నేరాలను, ఆర్థిక నేరాలను ఆపాలని, అవి విపరీతంగా జరుగుతున్నాయని మల్లన్న సవాల్ విసిరారు. దేశంలో ప్రతి 8నిమిషాలకు ఒక పిల్లాడిని కిడ్నాప్ చేస్తున్నారని అన్నారు. మల్లన్న చేసిన సవాళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలా వైరల్ అవుతున్నాయి. కొందరు మల్లన్నను సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. గతంలో సజ్జనార్ నిర్వహించిన ఎన్ కౌంటర్ల వంటి కీలక ఆపరేషన్లను విస్మరించడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: