📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Hyderabad: దేవుడి దగ్గరికి వెళ్తున్నానంటూ..ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ మృతి

Author Icon By Anusha
Updated: August 3, 2025 • 1:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన మూఢనమ్మకాల ప్రభావం ఇప్పటికీ సమాజంలో ఎంత గాఢంగా ఉందో మరోసారి బయటపెట్టింది. మహిళలు అంతరిక్షానికి వెళ్లి ప్రయోగాలు చేసే ఈ ఆధునిక కాలంలోనూ కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాల పంజా బిగుసుకుపోయింది. నగరంలోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్‌నగర్ (Himayatnagar) ఉర్దూ హాల్ ఎదురుగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో పూజా జైన్ (43) అనే గృహిణి దేవుడి దగ్గరకు వెళ్తున్నానని చెప్పి భవనం అయిదో అంతస్తు పై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,

మహిళలు రాకెట్‌లో అంతరిక్షం చేరి, నెలల తరబడి ప్రయోగాలు జరుపుతున్న ఈ కాలంలోనూ మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. తాజాగా ఓ గృహిణి దేవుడి దగ్గరికి వెళ్తున్నాని చెప్పి భవనం అయిదో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ షాకింగ్‌ ఘటన హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం,నగరంలోని హిమాయత్‌నగర్‌ ఉర్దూ హాల్‌ ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తులో అరుణ్‌కుమార్‌ జైన్‌ (Arun Kumar Jain) అనే వ్యాపారికి 2002లో పూజా జైన్‌ (43)తో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. ఓ అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. అయితే గత ఐదేళ్లుగా పూజా మానసిక సమస్యతో బాధపడుతోంది. ఇందుకు చికిత్స కూడా తీసుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు దైవ చింతన పెరిగింది. దీంతో రోజంతా ఆమె ఆధ్యాత్మికతలో గడపసాగింది.

ఐదో అంతస్తుపై నుంచి కిందకు దూకేసింది

ఈ క్రమంలో శనివారం (ఆగస్టు 3) ఉదయం ఆమె భర్త అరుణ్‌కుమార్‌ జైన్‌ ఆఫీస్‌కి వెళ్లిపోయారు. కొడుకు, కూతురుతోపాటు పని మనిషి ఇంట్లో ఉన్నారు. శనివారం మధ్యాహ్నం వరకు పూజ గదిలో ఒంటరిగానే కూర్చున్న పూజా జైన్‌, ఏం జరిగిందో తెలియదుగానీ ఒక్కసారిగా ఐదో అంతస్తుపై నుంచి కిందకు దూకేసింది. దీంతో తీవ్రగాయాల పాలైన పూజాను హుటాహుటీన హైదర్‌గూడలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు ఆత్మహత్యకు ముందు కూర్చున్న గదిలో పోలీసులకు ఓ ఉత్తరం కనిపించింది. దైవధ్యానంలో గడుపుతూ ఆత్మార్పణ చేసుకుంటే దేవుడికి వద్దకు చేరుకుంటామని, స్వర్గం ప్రాప్తిస్తుందని జైన గురువుల సూక్తి అందులో రాసి ఉన్నట్లు ఎస్సై నాగరాజు మీడియాకు తెలిపారు.

ఆత్మహత్యకు ప్రధాన కారణాలు ఏమిటి?

మానసిక ఒత్తిడి, నిరాశ, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, సంబంధాల లోపం, మానసిక రుగ్మతలు ఆత్మహత్యకు ప్రధాన కారణాలు.

ఆత్మహత్యను నివారించవచ్చా?

అవును, మానసిక ఆరోగ్య నిపుణుల సలహా, కుటుంబ మద్దతు, సానుకూల ఆలోచనలు, సమస్యలను పంచుకోవడం ద్వారా ఆత్మహత్యను నివారించవచ్చు.

Read hindi news:

Read Also:

https://vaartha.com/mlc-kavitha-mlc-kavithas-harsh-comments-on-jagadish-reddy/telangana/525177/

Breaking News Himayatnagar tragic incident Hyderabad woman suicide latest news Narayanaguda police news superstitious beliefs India Telugu News woman jumps from building

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.