📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

Hyderabad: కన్న తండ్రిని హత్య చేసిన కుమార్తె..ఎందుకంటే?

Author Icon By Anusha
Updated: July 10, 2025 • 3:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని

మానవ సంబంధాల విలువలు పడిపోతున్న పరిస్థితుల్లో, తెలంగాణలోని ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ చెరువులో చోటుచేసుకున్న ఓ ఘోర ఘటన అందరినీ కలిచివేసింది.తన వివాహేతర బంధానికి అడొస్తున్న కన్నతండ్రిని, ప్రియుడు, తల్లితో కలిసి హత్య చేసిందో కుమార్తె. ఆ తర్వాత ఏమాత్రం భయం లేకుండా, సెకండ్ షో సినిమాకు వెళ్లింది. ఆ తర్వాత తిరిగ్గా వచ్చి, తండ్రి శవాన్ని క్యాబ్‌లో తీసుకెళ్లి, ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో పడేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్కేసర్ (Ghatkesar) మండలం ఎదులాబాద్ చెరువులో ఈనెల 7న ఓ వ్యక్తి మృతదేహం వెలుగు చూసిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డెడ్‌బాడీని బయటకు తీయించారు. అయితే మృతదేహంపై గాయాలుండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన వ్యక్తిని హైదరాబాద్ కవాడిగూడ ముగ్గుల బస్తీకి చెందిన వడ్లూరి లింగం (45)గా గుర్తించారు.

స్వీపర్‌గా

ఆయనకు కల్లుతాగే అలవాటు ఉందని, అందరితో గొడవ పడేవాడని భార్య శారద(40), కుమార్తె మనీషా(25) చెప్పారు. ఈనెల 6న లింగం ఇంటి నుంచి వెళ్లినట్టు పోలీసులకు తెలిపారు. వారి మాటలపై అనుమానం వచ్చి చెరువు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది.చనిపోయిన లింగం పాతబస్తీలోని ఓ అపార్ట్మెంట్‌లో సెక్యూ రిటీగార్డుగా పని చేసేవాడు. అతడి భార్య జీహెచ్ఎంసీ (GHMC) లో స్వీపర్‌గా పని చేసేది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె మనీషాకు వివాహమైంది. అయితే కొన్నాళ్ల క్రితం మనీషాకు ఆమె భర్త స్నేహితుడు, జవహర్ నగర్ బీజే నగర్‌కు చెందిన మహ్మద్ జావీద్(24)తో వివాహేతర బంధం ఏర్పడింది. ఈ విషయం తెలియడంతో మనీషా భర్త ఆమెను వదిలివేశాడు. ప్రస్తుతం ఆమె ప్రియుడితో కలిసి మౌలాలీలోని ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. అయితే కుమార్తె భర్తను వదిలేసి.. మరొకరితో కలిసి ఉండడం నచ్చని లింగం ఆమెతో పలు మార్లు ఘర్షణ పడ్డాడు.

Hyderabad: కన్న తండ్రిని హత్య చేసిన కుమార్తె..ఎందుకంటే?

నిద్ర మాత్రలు

మనీషా తల్లి శారద కూడా, తన భర్త లింగం తరచుగా తనను అనుమానిస్తున్నాడని.. తనకు ఇతరులతో వివాహేతర బంధాలున్నాయని వేధిస్తున్నాడని కుమార్తెతో చెప్పింది. అప్పటికే తనను తిట్టాడని కోపంతో ఉన్న మనీషా (Manisha) తండ్రిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఈనెల 5న కుమార్తె నిద్ర మాత్రలు తీసుకొచ్చి తల్లికి ఇచ్చింది. వాటిని కల్లులో కలిపి భర్తకు ఇవ్వడంతో అతడు గాఢ నిద్రలోకి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన మనీషా, ఆమె ప్రియుడు జావీద్, తల్లి శారద, లింగం ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు.ఆ తర్వాత వారంతా ఏమాత్రం భయం లేకుండా సెకండ్ షో సినిమాకు వెళ్లి వచ్చారు. ఆపై ఒక క్యాబ్ బుక్ చేశారు.

కేసు నమోదు

మృతదేహాన్ని కారు ఎక్కిస్తుండగా డ్రైవర్ అనుమానంతో ప్రశ్నించాడు. కల్లు తాగి మత్తులో ఉన్నాడని చెప్పారు. ఎదులాబాద్ వద్ద దిగారు. అక్కడి నుంచి తీసుకెళ్లి చెరువులో పడేశారు. డెడ్‌బాడీ గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వీరు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు మనీషా, ఆమె ప్రియుడు జావేద్, తల్లి శారద (sharada) ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.ఈ ఘటన నైతిక విలువల పతనానికి నిదర్శనంగా నిలుస్తోంది. తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన కుమార్తె, తప్పును సరిదిద్దాల్సిన తల్లి – ఇద్దరూ కలిసి ప్రియుడితో కలసి ప్రణాళిక బద్ధంగా హత్య చేయడం సమాజాన్ని దెబ్బతీసే పని. ఇది కేవలం కుటుంబం కాకుండా, మానవత్వంపై వేసిన మచ్చగా మారింది.

కుమార్తెకు తండ్రి అంటే ఎందుకు ప్రత్యేకమైన బంధం ఉంటుంది?

తండ్రి అంటే కుమార్తెకు మొదటి హీరో. చిన్నప్పటినుండే ఆత్మవిశ్వాసం, భద్రత, ప్రేమ అనే భావాలు తండ్రి ద్వారా మొదలవుతాయి. ఆమె ఎదుగుదలలో తండ్రి ప్రభావం గణనీయంగా ఉంటుంది.

తండ్రి కుమార్తెపై ఎలా ప్రభావం చూపుతాడు?

తండ్రి ప్రేమ, శాంతి, క్రమశిక్షణతో పెంచితే కుమార్తె నైతిక విలువలు కలిగిన వ్యక్తిగా తయారవుతుంది. తండ్రి ప్రోత్సాహం ఆమెలో ధైర్యం, చదువుపై ఆసక్తి, సమాజంలో ధైర్యంగా ఎదగాలన్న ఆశక్తిని పెంపొందిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Shilpa Chakravarty: టీజీ హైకోర్టును ఆశ్రయించిన శిల్పా చక్రవర్తి..కారణమిదే?

Adultery leads to murder Breaking News Daughter kills father Edulabad Lake body found Father murdered by daughter Honour killing India latest news Telangana murder case Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.