Girl suicide over pet cat Hyderabad: వారం వ్యవధిలో ఇద్దరు బలి: పిల్లి చనిపోయిందని ఒకరు.. వద్దన్నందుకు మరొకరు

Read Time:  1 min
Girl suicide over pet cat Hyderabad: వారం వ్యవధిలో ఇద్దరు బలి: పిల్లి చనిపోయిందని ఒకరు.. వద్దన్నందుకు మరొకరు
FONT SIZE
GET APP

Girl suicide over pet cat Hyderabad: హైదరాబాద్‌లో పెంపుడు పిల్లుల కారణంగా గడిచిన వారం రోజుల్లో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.పిల్లి చనిపోయిందని మూడు రోజుల క్రితం మీర్‌ పేటకు చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకోగా, పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దన్నందుకు అల్వాల్‌లో నివాసం ఉంటున్న MBBS విద్యార్థిని శ్రేష్ట ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయింది. 

Read Also: Auto Drivers : ఆటో డ్రైవర్స్ కు గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్

Girl suicide over pet cat Hyderabad: అసలేం జరిగింది?

శ్రేష్ట అనే యువతి ఉన్నత చదువులు చదువుతూ, ప్రస్తుతం పీజీ (PG) ప్రవేశ పరీక్షల కోసం సిద్ధమవుతోంది. ఆమెకు పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం.పెంచుకుంటున్న ఒక పెంపుడు పిల్లి విషయంలో శుక్రవారం తల్లితో శ్రేష్ణ వాగ్వాదం జరిగింది. అప్పుడుపిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దని తల్లి శ్రేష్టను మందలించింది.

hyderabad-student-suicide-pet-cat-dispute-with-mother
hyderabad-student-suicide-pet-cat-dispute-with-mother

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రేష్ట ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికొచ్చిన పేరెంట్స్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన కూతురిని చేసి కన్నీరుమున్నీరుగా విలపించారు. PG పరీక్షలకు సిద్ధమవుతూ మంచి ఫ్యూచర్‌కి ప్లాన్‌ చేసుకుంటున్న అమ్మాయి సడన్‌గా ఇలా చిన్న గొడవకి ప్రాణాలు తీసుకోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

సమాజానికి ఒక హెచ్చరిక

నేటి యువత చిన్న చిన్న కారణాలకే తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒత్తిడిని తట్టుకోలేకపోవడం, భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం ఇటువంటి ఘటనలకు దారితీస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

https://vaartha.com/national/uttar-pradesh-husband-plans-to-murder-his-wife-sent-her-to-her-lover-out-of-fear/670999

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.