📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

Telugu news: Hyderabad: అయ్యో!.. బిడ్డను భవనం పై నుంచి తోసేసిన ఓ అమ్మ

Author Icon By Tejaswini Y
Updated: December 16, 2025 • 2:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్(Hyderabad) నగరంలోని వసంతపురి కాలనీలో సోమవారం సాయంత్రం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికను ఆమె తల్లే అపార్ట్‌మెంట్ పై నుంచి కిందకు తోసివేయడంతో తీవ్ర గాయాలపాలైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

Read also: Accident: పొగమంచు.. ఢీకొన్న 20 వాహనాలు.. నలుగురు మృతి?

మానసిక సమస్యలే కారణమా?.. హైదరాబాద్‌లో తల్లి ఘాతుకం

మల్కాజిగిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృత బాలిక కుటుంబం గత రెండు దశాబ్దాలుగా వసంతపురి కాలనీలో నివసిస్తోంది. బాలిక తండ్రి ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా, తల్లి మానసిక ఆరోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Hyderabad: Oops!.. A mother who pushed her child off the top of a building

సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా తల్లి తన కుమార్తెను మూడంతస్తుల భవనం పై నుంచి తోసివేసినట్లు తెలుస్తోంది. కింద ఉన్న మెట్లపై పడటంతో బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే చిన్నారిని గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)కి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతున్న సమయంలోనే బాలిక మృతి(Die) చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. బాలిక తల్లి మానసిక సమస్యలతో బాధపడుతున్న అంశాన్ని పోలీసులు కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

child death news Hyderabad Crime News Malkajgiri Police Mother Pushes Daughter Vasanthapuri Colony

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.