📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Hyderabad: పిల్లల్ని చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్న తల్లి

Author Icon By Sharanya
Updated: April 18, 2025 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ శివారు గాజులరామారంలో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం అందరికీ కంటి తడిగా మార్చింది. తల్లిగా తన బాధలను భరించగలిగినా పిల్లలు ఎదుర్కొంటున్న నొప్పిని తట్టుకోలేకపోయింది. కడుపున పుట్టిన పిల్లలను కన్నతల్లే కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఎంతకష్టమొచ్చినా నవమాసాలు మోసిన పిల్లల ఆలనాపాలనా చూసుకుంటుంది. కానీ తనకు ఉన్న ఓ అరుదైన కంటి వ్యాధి పిల్లలకు కూడా రావడంతో, ఆ బాధను భరిస్తూ జీవనం సాగిస్తున్నది.

ఓ తల్లి కన్నీటి గాధ

ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన తేజస్విని (35) తన భర్త గాండ్ర వెంకటేశ్వరరెడ్డి, ఇద్దరు కుమారులు అశీష్‌రెడ్డి (7), హర్షీత్‌రెడ్డి (5)లతో కలిసి జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాజులరామారంలో బాలాజీ లేఅవుట్‌లోని సహస్ర మహేశ్‌ హెయిట్స్‌ అపార్టుమెంట్‌లోని 204 ప్లాట్‌లో నివాసముంటున్నారు. ఇద్దరు కుమారులు అరుదైన కంటి వ్యాధితో బాధపడుతున్నారు. వారికి ప్రతి రెండు గంటలకోసారి కంట్లో మందు వేయాల్సి ఉంటుంది. లేదంటే, తీవ్ర నొప్పితో విలవిలలాడతారు. తల్లిగా తేజస్వినికి ఇది తట్టుకోలేని బాధ. పిల్లలు ఏడుస్తుంటే ఆమె గుండె ద్రవించేది. ప్రతి రోజు వారి నొప్పిని చూసి తన మనశ్శాంతి కోల్పోయింది. తేజస్వినికి ఎదురు వచ్చిన సమస్య కేవలం అనారోగ్యం కాదు సమాజం నుంచీ, కుటుంబం నుంచీ వచ్చిన హేళనలు. తన పిల్లలకు ఉన్న కంటి వ్యాధికి తానే కారణమనే అభిప్రాయంతో చాలామంది ఆమెను పక్కనబెట్టారు. ఇంట్లో భర్త కూడా ఆమెను తోడుగా నిలబడలేకపోయాడు. చివరికి చస్తే చావండి అని అనడంతో మనస్తాపం చెందిన తేజస్విని తన ఇద్దరు పిల్లలను హత్య చేసి, తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం వెంకటేశ్వరరెడ్డి డ్యూటీకి వెళ్లగా ఇంట్లో తేజస్విని, ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరు కుమారులను కత్తితో నరకిన తర్వాత ఆమె అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి మృతిచెంది. స్థానికులు తేజస్విని ప్లాటుకు వెళ్లిచూడగా వంటగదిలో ఇద్దరు కుమారులు రక్తపుమడుగులో పడి ఉన్నారు.

తేజస్విని ప్లాటులో పోలీసులు 8 పేజీల ఓ లేఖ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు కంటి సమస్య ఉంది. రెండు గంటలకు ఒకసారి కంట్లో మందు వేయకుంటే పిల్లలు నొప్పితో ఏడుస్తారు. దేవుడా నా పిల్లలకు ఎందుకు ఇంత బాధను ఇచ్చావు? నన్ను అందరూ పిచ్చిది అంటున్నారు. కంటి నొప్పి సమస్యలతో బాధపడుతున్న నా పిల్లలను నేనే చంపుకున్నాను. ఇంతటి పరిస్థితి ఏ తల్లికీ రావద్దు. నా పిల్లలు లేని బతుకు నాకు ఎందుకు? నేను కూడా చనిపోతున్నాను. అమ్మా, నాన్నా ఐ యామ్‌ సారీ. ఆస్తిలో ఒక్క పైసా కూడా నా భర్తకు ఇవ్వవద్దు. ఆస్తి మొత్తం అనాథలు, స్కూల్‌ పిల్లలకు ఇవ్వండి అంటూ తేజస్విని లేఖలో పేర్కొంది. ఈ ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read also: KTR : గచ్చిబౌలి భూముల వ్యవహారం..ప్రధానికి కేటీఆర్ విజ్ఞప్తి

#Gajularamaram #Hyderabad #MotherAndChildren #SadNews #telengana #tragicstory Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.