📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Hyderabad: కిడ్నీ రాకెట్ కేసులో సూత్రధారి డాక్టర్ పవన్ అరెస్టు

Author Icon By Anusha
Updated: July 23, 2025 • 5:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం రేపిన సరూర్నగర్ అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి కీలక నిందితుడు, సూత్రధారిగా వున్న డాక్టర్ పవన్ను (Dr. Pawan) సిఐడి అధికారులు అరెస్టు చేశారు. ముంబాయిలో రహస్యంగా వుంటున్న ఇతన్ని మంగళవారం నాడు అరెస్టు చేశారు. గత జనవరి నెలలో వెలుగు చూసిన ఈ గోల్మాల్ రాకెట్లో అలక నందతో పాటు జనని, అరుణ అనే మరో రెండు ఆసుపత్రుల పాత్ర వున్నట్లు వెలుగు చూడడం తెలిసిందే. ఈ రాకెట్లో తమిళనాడు, కర్నాటక, జమ్మూ కాశ్మీర్కు చెందిన వైద్యులతో పాటు వైద్య సహాయక సిబ్బంది పాత్ర వున్నట్లు నిర్ధారణ అవడం విదితమే. ఈ కేసులో మొదట అలకనంద ఆసుపత్రి ఎండి డాక్టర్ సుమంత్ పాటు, అలకనంద ఆసుప త్రి రిసెప్షనిస్టు గోపిలను అరెస్టు చేయగా ఆ తరువాత ఈ రాకెట్లో కీలక సూత్రధారి అయిన డాక్టర్ అవినాష్తో (Dr. Avinash) పాటు ఆపరేషన్ల సమయంలో సహాయకులుగా వున్న కర్నాటకు చెందిప పొన్ను స్వామి ప్రదీప్, సూరజ్ మిశ్రా, నల్లగొండకు చెందిన సపావత్ రవీందర్, రమావత్ రవి, సపావత్ హ రీష్, పొదిల సాయిలను అరెస్టు చేశారు.

Hyderabad: కిడ్నీ రాకెట్ కేసులో సూత్రధారి డాక్టర్ పవన్ అరెస్టు

దేశ వ్యాప్తంగా అనేకప్రాంతాలలో

దీని తరువాత ఈ కేసు విచారణ సిఐడికి బదిలీ అయ్యింది. ఈ కేసులో నిందితులు దేశ వ్యాప్తంగా అనేకప్రాంతాలలో వుండడంతో సిఐడికి బదలాయించారు. సిఐడి విచారణ చేబట్టాక కొందరు నిందితులు పట్టుబడగా తాజాగా డాక్టర్ పవన్ దొరికిపోయాడు. పవన్ పై వైజాగ్ లోనూ కేసులున్నట్లు సిఐడి (CID) విచారణలో తేలింది. వైజాగ్ లో నమోదైన కేసులో పవన్ తనకు బదులు మ రొకరిని జైలుకు పంపినట్లు తేలింది. ఇందుకు గానూ అతను తప్పుడు పత్రాలను సృష్టించాడు. కాగా అలకనంద ఆసుపత్రిలో గత ఏడాది డిసెంబర్ వరకు 20కిడ్నీ ఆపరేషన్లు జరిగాయని సిఐడి తేల్చింది. ఈ కేసులో మరికొందరు నిందితులు పట్టుబడాల్సి ఉంది.

CID అంటే ఏమిటి?

CID అనేది Crime Investigation Department అనే పదానికి సంక్షిప్త రూపం. దీన్ని తెలుగులో నేర విచారణ శాఖ అని పిలుస్తారు. ఇది రాష్ట్ర పోలీస్ విభాగానికి చెందిన ఒక ముఖ్యమైన అన్వేషణ (Investigation) విభాగం.

CID విధులు ఏమిటి?

CID ముఖ్యంగా గంభీర నేరాలు, మోసాలు, అవినీతి, అత్యాచారాలు, హత్యలు, ఆర్థిక నేరాలు వంటి కీలకమైన కేసులపై దర్యాప్తు చేస్తుంది. సాధారణ పోలీసులు విచారణ చేయలేని క్లిష్టమైన కేసులను CID చూడగలదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Agriculture Secretary Surendra: యూరియా కొరత లేదు

alakananda hospital Breaking News cid arrest kidney scam dr avinash arrest dr pawan arrest kidney racket hyderabad latest news saroor nagar kidney racket telangana kidney racket Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.