హైదరాబాద్‌లో చోటు చేసుకున్న భారీ సైబర్ (cibercrime) మోసం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నకిలీ పెట్టుబడి ఆఫర్ల పేరుతో ఓ వైద్యుడిని నమ్మించి ఏకంగా రూ.14.61 కోట్లు కొల్లగొట్టిన ఘటనలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కీలక ముందడుగు వేశారు. రాష్ట్ర చరిత్రలో ఒకే వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో సైబర్ మోసానికి గురికావడం ఇదే తొలిసారి కావడంతో, ఈ కేసును అధికారులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read also: Illegal Affair : ప్రియుడి కోసం భర్తను చంపి నాటకం
Cyber fraud of Rs. 14.61 crore
ఈ కేసుకు సంబంధించి ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంక్ ఖాతాలు సమకూర్చడంలో వీరి పాత్ర ఉందని విచారణలో తేలింది. వైద్యుడి నుంచి కాజేసిన కోట్ల రూపాయలను ఈ ఖాతాల ద్వారానే బదిలీ చేసినట్లు గుర్తించారు. నిందితుల నుంచి మరింత కీలక సమాచారం రాబట్టేందుకు ఐదు రోజుల కస్టడీకి అనుమతించాలని కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: