Crime news :సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ వృద్ధుడు సైబర్ మోసగాళ్ల మాటలు నమ్మి భారీగా డబ్బు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.
హస్కీ వాయిస్‌తో నమ్మించిన మహిళ
హైదరాబాద్‌లోని గోపన్‌పల్లికి చెందిన 80 ఏళ్ల వృద్ధుడికి ‘రిధివెలే’ అనే పేరుతో ఓ మహిళ ఫోన్ చేసింది. తీయని మాటలతో మాట్లాడి యాప్‌లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించింది.
యాప్‌లో భారీ లాభాలు వచ్చినట్లు చూపించారు
ఆమె చెప్పిన మాటలు నమ్మిన వృద్ధుడు యాప్‌లో డబ్బులు పెట్టడం ప్రారంభించాడు. కొద్ది రోజులకే ఆ యాప్‌లో రూ.62.77 లక్షల లాభం వచ్చినట్టు చూపించారు. దీంతో బాధితుడు ఆనందపడ్డాడు.
Read Also: Kamal Haasan-Trump: ట్రంప్‌కు కమల్ హాసన్ కౌంటర్
డబ్బు తీసుకోవాలంటే ఫీజు అంటూ మోసం
ఆ డబ్బును విత్‌డ్రా చేసుకోవాలంటే ‘కన్వర్షన్ ఫీజు’ చెల్లించాలని మోసగాళ్లు చెప్పారు. దీంతో బాధితుడు పలు విడతల్లో దాదాపు రూ.24.38 లక్షలు వారి ఖాతాలకు బదిలీ చేశాడు.
చివరకు మోసం బయటపడింది
ఇంకా డబ్బు కావాలని మోసగాళ్లు వేధించడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. వారిని ప్రశ్నించగానే ఫోన్ కట్ చేశారు. తాను మోసపోయానని గ్రహించిన వృద్ధుడు వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: