హైదరాబాద్ మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పురా ప్రాంతంలో ఓ ఫ్లాట్‌లో ఇద్దరు వృద్ధులు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతులను మొహమ్మద్ షకీల్, సర్వర్ బేగంగా గుర్తించారు. వీరిద్దరూ సోదరుడు–సోదరి కాగా, గత 40 ఏళ్లుగా అదే ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది.
Read also: Maharashtra: అజిత్ పవార్ మృతి.. 3 రోజుల సంతాప దినాలుగా ప్రకటించిన ప్రభుత్వం
Two bodies found under suspicious circumstances.
అన్నే ఆధారం.. అవివాహిత జీవితం
మొహమ్మద్ షకీల్, సర్వర్ బేగం ఇద్దరూ అవివాహితులే. శారీరకంగా దివ్యాంగురాలైన సోదరిని అన్న షకీల్ ఎంతో బాధ్యతగా చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరూ బయట వ్యక్తులతో పెద్దగా సంబంధాలు లేకుండా ప్రశాంతంగా జీవించేవారని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇద్దరూ ఒకేసారి మృతి చెందడం అనుమానాలకు దారి తీస్తోంది.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. ఇది సహజ మరణమా, లేక ఆత్మహత్యనా (suiside) లేదా ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి నిజాలు వెలుగులోకి రానున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: