📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Hyderabad crime: ప్రాణం బలిగొన్న బోండా

Author Icon By Tejaswini Y
Updated: January 31, 2026 • 1:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad crime: అనుకోని ప్రమాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. టిఫిన్ తింటుండగా బోండా గొంతులో ఇరుక్కొని ఊపిరాడక ఒక లారీ డ్రైవర్ మృతి(Death) చెందిన ఘటన యూసుఫ్‌గూడ పరిధిలో కలకలం రేపింది.

Read Also: AP: పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం

Hyderabad crime

అసలేం జరిగింది?

పోలీసుల వివరాల ప్రకారం.. రహ్మత్‌నగర్‌ ఎస్‌.పి.ఆర్‌ హిల్స్‌కు చెందిన దాసరి రమేష్‌ (45) వృత్తిరీత్యా లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో యూసుఫ్‌గూడ శ్రీకృష్ణదేవరాయనగర్‌ సమీపంలోని ఒక టిఫిన్‌ సెంటర్‌ వద్ద బోండాలు తింటున్నాడు.

ఆ సమయంలో ప్రమాదవశాత్తు బోండా ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఒక్కసారిగా ఊపిరాడక రమేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అర్ధరాత్రి కావడంతో ఎవరూ గమనించలేకపోయారు.

పోలీసుల దర్యాప్తు

శుక్రవారం ఉదయం స్థానికులు రమేష్ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రమేష్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం టిఫిన్ తింటూ ఇలా ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Bonda Choking Accident Choking Death Hyderabad News Lorry Driver Death Rahmath Nagar SPR Hills Unexpected Death Yousufguda

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.