📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Hyderabad Crime: భార్య కేసు పెట్టిందని భర్త ఆత్మహత్య

Author Icon By Tejaswini Y
Updated: November 15, 2025 • 12:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad Crime: భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు కలిగిన మనస్తాపంతో భోలక్‌పూర్‌ కృష్ణానగర్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన దుర్ఘటన గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది.

కృష్ణానగర్‌లో నివసిస్తున్న 28 ఏళ్ల విశాల్‌ గౌడ్‌ టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. 2023 డిసెంబర్‌లో మల్లాపూర్‌కు చెందిన నవ్య (25)తో అతని వివాహం జరిగింది. అయితే కొద్దికాలానికే దంపతుల మధ్య పెను విభేదాలు మొదలయ్యాయి. పెద్దలు పలుమార్లు మాట్లాడించి సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినా, ఇద్దరి మధ్య సంబంధాలు మెరుగుపడలేదు. చివరికి నవ్య ఈ సంవత్సరం మార్చిలో పుట్టింటికి వెళ్లి తిరిగి రావలేదు.

Read Also: TG High Court: హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు తీవ్ర హెచ్చరిక

ఇటీవల నవ్య ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో విశాల్‌పై ఫిర్యాదు చేయడంతో, పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం కేసు నమోదు కావడంతో మరోసారి స్టేషన్‌కు రావాలని పోలీసుల నుంచి కాల్ రావడంతో విశాల్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో విశాల్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని తన ప్రాణాలు తీసుకున్నాడు. తలుపు పగులగొట్టి లోపల చూసిన కుటుంబసభ్యులు అతను అప్పటికే మరణించాడని గుర్తించారు. తమ కుమారుడి ఆత్మహత్యకు నవ్య, ఆమె బంధువుల వేధింపులే కారణమని విశాల్ తల్లిదండ్రులు ఆరోపించారు. వారి ఫిర్యాదు ఆధారంగా గాంధీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

CrimeNews GandhinagarPolice HyderabadNews SoftwareEngineer SuicideCase TelanganaUpdates UppalPolice

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.