Hyderabad Crime: యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Read Time:  1 min
Hyderabad Crime: యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
FONT SIZE
GET APP
Hyderabad Crime: Boyfriend who gave HIV blood to a young woman.. If you know the reason, you will be shocked
Hyderabad Crime: Boyfriend who gave HIV blood to a young woman.. If you know the reason, you will be shocked

Hyderabad Crime: ప్రస్తుత సమాజంలో సినిమాలను మించిన క్రూరమైన ఘటనలు నిజ జీవితాల్లోనూ చోటు చేసుకుంటున్నాయి. సినిమాల్లోని విలన్ క్యారెక్టర్ల మాదిరిగే కొందరు మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ శివారు పోచారంలో అమానుష ఘటన వెలుగుచూసింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు.. సదరు యువతికి ఎయిడ్స్ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాడు. 

Read Also: Borabanda Crime: షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడికి ఇటీవల ఓ యువతితో పెళ్లి ఖాయమైంది. ఇప్పటికే షాపింగ్, పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉండగా.. మనోహర్‌కు ఎయిడ్స్ (HIV) ఉన్నట్లు ఇతర బంధువుల ద్వారా అమ్మాయి తరపు కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో సదరు యువతి, ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రాణాంతకమైన వ్యాధి ఉన్న వ్యక్తితో జీవితాన్ని పంచుకోని తన జీవితం నాశనం చేసుకోలేనంటూ యువతి పెళ్లిని నిరాకరించింది. ఈ మేరకు అమ్మాయి కుటుంబసభ్యులు అబ్బాయి తల్లిదండ్రులకు విషయం చెప్పారు.

తనతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవటాన్ని మనోహర్ జీర్ణించుకోలేకపోయాడు. బంధువులు, గ్రామంలో పరువు పోయిందని భావించాడు. తన పెళ్లి రద్దవ్వడానికి ఆ యువతే కారణమని భావించి ఆమెపై పగ పెంచుకున్నాడు. ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లిన మనోహర్.. అమ్మాయితో గొడవకు దిగాడు. తనను పెళ్లి ఎందుకు చేసుకోవంటూ నిలదీస్తూ ఘర్షణకు దిగాడు. ఆ తర్వాత ముందే తెచ్చికున్న సిరంజితో ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఆమెకు బలవంతంగా ఎక్కించాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన బాధితురాలు గట్టిగా కేకలు వేసింది.

కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరుకొని మనోహర్‌ను పట్టుకున్నారు.అనంతరం బాధితురాలిని వెంటనే సమీపంలోని హాస్పిటల్ తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ప్రస్తుతం బాధితురుల ఆసుపత్రిలోనే ఉంది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బలవంతంగా ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చిన నిందితుడు మనోహర్‌ను అరెస్టు చేశారు. 

కుటుంబ నేపథ్యం, పెళ్లి నిరాకరణ

ఉన్మాది మనోహర్ పోలీసుల విచారణలో నోరు విప్పాడు. తాను చేసిన ఈ దారుణానికి వెనుక ఉన్న కారణాలను వెల్లడించి పోలీసులనే విస్మయానికి గురిచేశాడు. తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి HIV వస్తే, ఇక ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోరని, చివరికి తనకే ఇచ్చి పెళ్లి చేస్తారనే క్రూరమైన ఆలోచనతోనే ఈ పనిచేసినట్లు మనోహర్ అంగీకరించాడు. మనోహర్ తల్లిదండ్రులిద్దరికీ HIV పాజిటివ్ ఉండగా, తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.