हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: hyd crime: మానసిక వేదన .. ఒక్క కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

Pooja
Telugu News: hyd crime: మానసిక వేదన .. ఒక్క కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

హైదరాబాద్(hyd crime) నగరంలో హృదయవిదారక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆరు నెలల కిందట పెద్ద కుమార్తె మృతి చెందగా, ఆ సంఘటన నుంచి కోలుకోలేక కుటుంబంలో మిగిలిన ముగ్గురు కూడా బలవన్మరణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

Read Also: Karimnagar: 6 లక్షలకు బిడ్డ విక్రయం సంచలనం

రాంనగర్ నుంచి అంబర్‌పేటకు మారిన కుటుంబం
రాంనగర్‌కు చెందిన శ్రీనివాస్ (45), ఆయన భార్య విజయలక్ష్మి (42) దంపతులు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు — కావ్య మరియు శ్రావ్య (16). అయితే ఆరు నెలల క్రితం పెద్ద కుమార్తె కావ్య ఆత్మహత్య చేయడం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ దెబ్బ నుంచి బయటపడలేక, నెల రోజుల క్రితం రాంనగర్ నుంచి అంబర్‌పేటలోని రామకృష్ణానగర్‌లో అద్దె ఇంటికి మారారు. అప్పటి నుంచి వారు చాలా మందితో దూరంగా ఉంటూ, మానసికంగా బాగా కుంగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.

దుర్వాసనతో విషయం బయటపడింది
శనివారం సాయంత్రం శ్రీనివాస్ అక్క సువర్ణ ఇంటికి వెళ్లి పలకరించే ప్రయత్నం చేసినా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చింది. అంతేకాకుండా ఇంటి నుంచి దుర్వాసన రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసుల బృందం తలుపులు తెరిచి చూసేసరికి నలుగురు కూడా విగతజీవులై కనిపించారు. శ్రీనివాస్ ఇంటి ప్రధాన ద్వారం వెంటిలేటర్‌కు ఉరివేసుకున్నాడు. భార్య విజయలక్ష్మి, కుమార్తె శ్రావ్య గదిలోని కిటికీ ఇనుప చువ్వలకు చీరలతో ఉరివేసుకుని ఆత్మహత్య చేశారు. ఇద్దరు రోజుల క్రితం మృతి(hyd crime) చెందడంతో శవాలు కుళ్లిన స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మానసిక ఒత్తిడే కారణమై ఉండొచ్చని అనుమానం
పెద్ద కుమార్తె మరణం తర్వాత దంపతులు తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లారనీ, పని చేయడంలో కూడా ఇబ్బంది పడుతున్నారనే వివరాలు వెలుగులోకొచ్చాయి. ఈ పరిస్థితుల్లోనే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో ఎలాంటి సుసైడ్ నోట్ లభించలేదు. కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. వరుసగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870