పెళ్లంటే ఏడడుగుల బంధం మాత్రమే కాదు, కడవరకు తోడుండే మధురమైన ప్రేమ పొదరిల్లు. ఒకరికి ఒకరు తోడుంటే ఈ ప్రపంచాన్నే మర్చిపోయి, తమదైన అనుబంధంలో తేలిపోతుంటారు. అలాంటి బంధాలు అల్పమైన, క్షణికమైన సుఖాల కోసం కొందరు పక్కదారిపడతారు. వివాహేతర సంబంధాలకు మొగ్గుచూపుతారు. కట్టుకున్నవారు, అయినవారు ఎవరు ఏమనుకుంటే తమకెందుకు అనుకుని, ఆ అక్రమసంబంధంలోనే కొనసాగుతారు. దీంతో తమకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కొని, బయటపడేవారు కొందరైతే సున్నితమనస్కులు మాత్రం ఆ బాధనుంచి తేరుకోలేక, చావే తమకు శరణ్యమని భావిస్తారు. సరిగ్గా నోయిడాలో ఇలాంటి సంఘటనే జరిగింది.
భర్తను మోసం చేసి, ప్రియుడితో వెళ్లిపోయిన భార్య
తన భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందన్న విషయం తెలిసిన అతను తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేక జీవితంపై ఆశను కోల్పోయి, ఆత్మహత్య (suicide) కు పాల్పడ్డాడు. అంకిత్ అనే యువకుడికి ఓ యువతితో నాలుగునెలల క్రితమే పెళ్లైంది. అయితే అంకిత్ భార్య, అర్థంలేని కారణాలతో తన ఇంటిని వదలివెళ్లిపోయింది. దీనిపై నిఘాపెట్టిన భర్త చివరకు భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందన్న విషయం తెలిసి అతడు తట్టుకోలేకపోయాడు.
వీడియో రికార్డు చేసి, ఆత్మహత్య
అంకిత్ (Ankit) చనిపోయేముందు తన భార్య తనకు చేసిన మోసం, తనపై చూపిన ఆ ప్రభావం, న్యాయం కోసం తాను చేసిన ప్రయత్నంలో ఎలా విఫలమయ్యాడో వివరించాడు. పోలీసులకు తాను ఫిర్యాదు చేసినా, వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అంకిత్ ఆరోపించాడు. పోలీసుల నిర్లక్ష్యమే తన ఆత్మహత్యకు కారణమని చెప్పుకొచ్చాడు.
మృతుడి కుటుంబ సభ్యుల నిరసన
మృతుల కుటుంబ సభ్యులు ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడికి న్యాయం జరగాలని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సకాలంలో స్పందించి సానుభూతితో బాధితుడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించి ఉంటే తమ కుమారుడు మరణించే వాడు కాదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఏదీఏమైనా చావే సమస్యలకు పరిష్కారం కాదు. జీవితం అమూల్యమైనది. బలవంతంగా జీవితానికి ముంగిపు
పలకరాదు. కడదాకా పోరాడాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: