📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Encounter: ఆస్పత్రిలో హత్యకేసు.. ఇద్దరు అనుమానితులకు గాయాలు

Author Icon By Sharanya
Updated: July 22, 2025 • 1:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలోనే సంచలనం సృష్టించిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్యాంగ్స్టర్ హత్యకేసులో పోలీసులు అనుమానితుల కోసం గాలిస్తున్నారు. గతవారం పాట్నా (Patna) లోని ఓ ఆస్పత్రిలో చందనిమిశ్రా అనే గ్యాంగైర్పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి, హతమార్చిన ఘటన విధితమే. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన తీవ్రసంచలనంగా మారడంతో పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిందితుల కోసం జల్లెడపడుతున్నారు. ఇందులో భాగంగా ఆరా పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానితులు ఎదురయ్యారు. అయితే వారు పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్లో (Encounter) హత్య కేసుకు సంబంధించిన ఇద్దరు అనుమానితులకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. సోమవారం అర్థరాత్రి మిశ్రా హత్యకేసుతో సంబంధం ఉన్న నేరస్థులను పట్టుకునే ప్రయత్నం చేయగా ఎన్ కౌంటర్ (Encounter) చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.


కేసులో కీలక పురోగతి


ఐసీయులో చికిత్స పొందుతున్న గ్యాంగ్స్టర్ చందనిమిశ్రాను దుండగులు లోపలికి వెళ్లి కాల్పులు చేసి, హతమార్చారు (Killed). ఈ దృశ్యాలు ఆస్పత్రి సీసీకెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో దేశంలోనే సంచలన కేసుగా మారింది. ఘటనలో ఐదుగురు నిందితులను గుర్తించిన పోలీసులు ఒకరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మిగతా నలుగురు నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల దేశంలో హత్యలు పెరిగిపోతున్నాయి. ఏకంగా ఐసీయులో చికిత్స పొందుతున్న వ్యక్తులు నేరుగా ఆస్పత్రిలోకి ప్రవేశించారంటే అక్కడ ఉన్న భద్రతలోపాలు స్పష్టంగా తెలుపుతున్నది. నిత్యం సెక్యూరిటీ ఉండే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు జరగడంతో ఒక్కసారిగా దేశంలోని కార్పొరేట్ ఆస్పత్రిల్లోని భద్రతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also: Jagdeep Dhankhar: ధన్ ఖడ్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి

Breaking News Chandani Mishra encounter Encounter Case Hospital Murder Case latest news Patna Police Firing Suspects Injured Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.