📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Chaitanya Nanda:ఘోరం.. 17 మంది విద్యార్థినులపై స్వామీజీ లైంగిక వేధింపులు

Author Icon By Pooja
Updated: September 24, 2025 • 12:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భక్తి అంటే దేవుడికి భక్తుడికి మధ్య ఉండే అవినాభావన సంబంధం. దేవుడితో పెనవేసుకుని, ఆయననే సేవిస్తే మోక్షమార్గం లభిస్తుందని అందరూ భావిస్తారు. ఈ మోక్షం చేరేందుకు ఎన్నో తిప్పలు పడుతుంటారు. యజ్ఞాలు, యాగాలు చేస్తుంటారు. పుణ్యనదుల్లో మునుగుతారు. సనాతన ధర్మాన్ని ఆచరించేందుకు పీఠాధిపతుల వద్ద శిక్షణ తీసుకుంటారు. పీఠాధిపతులంటే(priests) సమాజంలో ఉన్నతమైన గౌరవం. అలాంటి వారే ఆకృత్యాలకు పాల్పడితే వారినేం చేయాలి? దేశరాజధాని ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆశ్రమంలో ఇలాంటి సంఘటనే జరిగింది.

విద్యాదానం పేరిట లైంగిక వేధింపులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోని శ్రీశారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్టీ సారధి తమను లైంగికంగా వేధించాడని 17 మంది విద్యార్థినులు పోలీసులను ఆశ్రయించారు. ఆర్థికంగా వెనుకబడిన (ఈడబ్ల్యూఎస్) కోటాలో స్కాలర్షిప్ తో పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ కోర్సులు చదువుతున్న విద్యార్థినులను స్వామి చైతన్యానంద లక్ష్యంగా చేసుకున్నారు. అసభ్యకరమైన భాష వాడటం, అసభ్యకరమైన సందేశాలు పంపడం. బలవంతంగా తాకడం వంటి చర్యలకు పాల్పడ్డారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక స్వామి డిమాండ్లకు ఒప్పుకోవాలంటే కొంతమంది మహిళా సిబ్బంది, వార్డెన్లు ఒత్తిడి తెచ్చారని వారు ఆరోపించారు. పోలీసులు స్వామీజీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసి నిందితుడు పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం పోలీసులు అతడికోసం గాలిస్తున్నారు.

పదవి నుంచి తొలగించిన శ్రీశారదా పీఠం

ఈ ఆశ్రమం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శృంగేరి శ్రీ శారదా పీఠానికి చెందిన శాఖ కావడంతో ఈ ఘటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆరోపణలు వెల్లువెత్తడంతో శృంగేరి పీఠం వెంటనే స్పందించింది. స్వామి చైతన్యానంద చర్యలు చట్టవిరుద్ధమని, పీఠం నియమాలకు వ్యతిరేకమని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. అతడిని పదవి నుంచి తొలగించడమే కాకుండా, పీఠంతో అతనికి ఉన్న సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్లు ప్రకటించింది. అంతేకాక పోలీసుల దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇనిస్టిట్యూట్ బేస్మెంట్లో(institute basement) నిందితుడు ఉపయోగించిన వోల్వో కారును గుర్తించారు. ఆ కారుకు నకిలీ డిప్లొమాటిక్ నంబర్ ప్లేట్ ఉన్నట్లు తేలడంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. భక్తి పేరుతో తప్పుడు పనులకు పూనుకుంటే దాని శిక్ష నుంచి తప్పించుకోలేరు. అమాయక పేద విద్యార్థినులను ఏమీ చేసినా చెల్లుబాటు అవుతుందని భావించే స్వామీజీలాంటి వారికి ఇదొక గుణ పాఠం.

సంఘటన ఎక్కడ జరిగింది?
ఈ ఘటన చైతన్య నంద అనే స్వామీజీ ఆశ్రమంలో చోటుచేసుకుంది.

ఎన్ని మంది బాధితులు ఉన్నారు?
మొత్తం 17 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News in Telugu Chaitanya Nanda Google News in Telugu Latest News in Telugu Sexual Harassment Case Students Safety Swamiji Arrest Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.