📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Honeymoon Murder: పెళ్లైన ఐదో రోజు నుంచే హత్యకు స్కెచ్‌

Author Icon By Ramya
Updated: June 10, 2025 • 12:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Honeymoon Murder కేసు: సోనమ్ రఘువంశీ ఉదంతం – సుపారీ ఇచ్చి భర్తను హతమార్చిన వైనం

ప్రియుడితో కలిసి సుపారీ ఇచ్చి మరీ భర్తను హతమార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్ రఘువంశీ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ యువతి, తన భర్త రాజా రఘువంశీతో కలిసి హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్ళింది. అక్కడే ఆమె తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్తను హతమార్చేందుకు కుట్ర పన్ని, అమలు చేసింది. హత్య అనంతరం సోనమ్ అదృశ్యమవడంతో ఈ కేసు మరింత ఉత్కంఠగా మారింది. పోలీసులు తీవ్రంగా శ్రమించి, టూరిస్ట్ గైడ్‌లు, హోటల్ సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్ డేటా వంటి ఆధారాలను సేకరించి, ఈ మొత్తం కేసు వెనుక ఉన్న పూర్తి కథనాన్ని వెలికితీశారు. మేఘాలయలో హనీమూన్ జంట మిస్సింగ్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపగా, చివరికి హత్యకు కుట్ర పన్నింది భార్యేనని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో సోనమ్ రఘువంశీని పోలీసులు అరెస్ట్ చేసి, మేఘాలయకు తరలించారు. అనంతరం ఆమెను పాట్నాకు తరలించి, అక్కడి ఫుల్వారీ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఈరోజు మధ్యాహ్నం 12.55 గంటలకు పాట్నా నుంచి గౌహతికి విమానంలో తరలించి, అక్కడి నుంచి మేఘాలయకు తీసుకెళ్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణమైన హత్య వెనుక ఉన్న సంక్లిష్టమైన కుట్ర, సోనమ్, రాజ్ కుష్వాహా పాత్రలు సమాజాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. తొలుత తాను అమాయకురాలినని, ఎవరో తనను కిడ్నాప్ చేశారని సోనమ్ బుకాయించినా, పోలీసుల దర్యాప్తులో నిజాలు బయటకు రావడంతో ఆమె తన నేరాన్ని అంగీకరించింది.

Honeymoon Murder

భర్త మర్డర్‌కు పెళ్లైన ఐదో రోజు నుంచే స్కెచ్: దర్యాప్తులో వెలుగుచూసిన షాకింగ్ నిజాలు

Honeymoon Murder: ఇండోర్‌కు చెందిన ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారి రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీల పెళ్లి మే 11న జరిగింది. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. అయితే, ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లయిన ఐదో రోజే, అంటే మే 16న, సోనమ్ తన ప్రేమికుడు రాజ్ కుష్వాహాతో కలిసి తన భర్త హత్యకు పక్కా ప్రణాళిక వేసినట్లు పోలీసులు తెలిపారు. ‘రాజాను చంపేద్దాం.. కిడ్నాప్ నాటకం చేద్దాం. అప్పటికి నేను విదవగా మారతాను. నాన్న కూడా మన పెళ్లికి అంగీకరిస్తారు’ అని సోనమ్ తన ప్రియుడు రాజ్‌తో చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ దారుణమైన ప్రణాళికలో భాగంగా, భర్తను హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి (డావ్)ని గువాహటిలోంచి ఆన్‌లైన్ ద్వారా తెప్పించారు. సంఘటనకు ముందు, నిందితులు సోనమ్ హోం స్టేకు 1 కిలోమీటర్ దూరంలోని ఒక హోటల్లో బస చేశారు. వారికి లొకేషన్ పంపించింది కూడా సోనమే. మే 23న ఫోటోషూట్ నెపంతో సోనమ్, రాజాను ఒంటరిగా ఉన్న కొండ ప్రాంతానికి తీసుకెళ్లింది. అదును చూసి ‘చంపేయండి’ అని ఆమె అరవడంతో, అక్కడే ఉన్న ముగ్గురు యువకులు రాజా రఘువంశీని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. తర్వాత నిందితుడు విశాల్ చౌహాన్ రాజా తలపై కత్తితో గాయపరిచాడు. మరో నిందితుడు ఆకాశ్ రాజ్‌పుత్ దూరం నుంచి బైక్ మీద ఉండి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాడు. మొదట నిందితులు ఈ పని చేయడానికి ఒప్పుకోలేదు. కానీ సోనమ్ వారికి రూ.20 లక్షలు ఇస్తానని ఆశ చూపడంతో అంగీకరించారు. ఈ వివరాలు పోలీసుల విచారణలో బయటపడటంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు.

హత్య తర్వాత సోనమ్ పలాయనం, పోలీసుల వలలో చిక్కిన వైనం

మే 23న హత్య చేసిన అనంతరం అదే రోజు శిలాంగ్ నుంచి గువాహటికి వెళ్ళిన సోనమ్, అక్కడి నుంచి రైలు ఎక్కి వారణాసి మీదుగా గాజీపూర్‌కు పారిపోయింది. తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు దారి మధ్యలో తన మొబైల్ ఫోన్‌లను కూడా ధ్వంసం చేసింది. అయితే పోలీసుల విచారణలో సోనమ్ సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. అందులో ఆమె నిందితులతో మాట్లాడుతున్న దృశ్యాలు ఉండటంతో పోలీసులకు కీలక ఆధారం లభించింది. తర్వాత కాల్ డేటా రికార్డ్స్ (CDR), కాల్ ట్రేసింగ్ ఆధారంగా రాజ్ కుష్వాహా స్థానికంగా ఉన్నట్లు తెలిసి, అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే సోనమ్ తన ‘గేమ్’ ముగిసిందని అర్థం చేసుకుని, ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఢాబాలోకి వెళ్లి పోలీసులకు లొంగిపోయింది.

ఈ కేసులో అత్యంత విస్మయం కలిగించే అంశం ఏంటంటే, హత్యకు కుట్ర పన్నిన రాజ్ కుష్వాహానే, రాజా అంత్యక్రియలో స్వయంగా పాల్గొని తతంగం జరిపించాడు. మృతుడి మామ దవీ సింగ్‌ను ఓదారుస్తూ ఉండటం వీడియోల్లో కనిపించింది. ఇందులో అతడు తీవ్ర భావోద్వేగంలో ఉన్నట్లు కనిపించడం మరో విశేషం. రాజా రఘువంశీని కిరాతకంగా హత్య చేసిన రాజ్ కుష్వాహానే అంత్యక్రియలు జరిపించిన విషయం తెలిసి బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది, మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసు సమాజంలో మానవ సంబంధాలు, నమ్మక ద్రోహం, నేర స్వభావంపై తీవ్రమైన చర్చకు దారి తీస్తోంది.

Read also: Raja Raghuvanshi: రాజా రఘువంశీని తలపై కొట్టి హతమార్చారు

#crimenews #HoneymoonMurder #Justice #meghalayacrime #PoliceInvestigation #RajaRaghuvanshi #RajKushwaha #SonamRaghuvanshi #suparimurder #Thrilling Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.